HomeNewsHyderabad Real Estate: కోకాపేట, మూసాపేట భూముల వేలంలో సున్నా.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిజంగా...

Hyderabad Real Estate: కోకాపేట, మూసాపేట భూముల వేలంలో సున్నా.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిజంగా డౌన్ అయిందా..

Hyderabad Real Estate:హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు పెట్టుబడిదారుల నుంచి భారీ పోటీ ఎదుర్కొన్న కోకాపేట.. మూసాపేట భూముల వేలానికి ఈసారి కొనుగోలు ధరలు ముందుకు రాలేదు. హైదరాబాదు మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో కనీసం ఒక్క బిడ్ కూడా నమోదు కాలేదు. దీంతో అధికారులు రెండు ప్రాంతాల్లోని భూముల వేలం ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం కోకాపేట నియో పొలీస్ లో 4.59 ఎకరాల భూమికి […]

Hyderabad Real Estate:హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు పెట్టుబడిదారుల నుంచి భారీ పోటీ ఎదుర్కొన్న కోకాపేట.. మూసాపేట భూముల వేలానికి ఈసారి కొనుగోలు ధరలు ముందుకు రాలేదు. హైదరాబాదు మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో కనీసం ఒక్క బిడ్ కూడా నమోదు కాలేదు. దీంతో అధికారులు రెండు ప్రాంతాల్లోని భూముల వేలం ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది.

శుక్రవారం ఉదయం కోకాపేట నియో పొలీస్ లో 4.59 ఎకరాల భూమికి వేలం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం మూసాపేట ట్రక్ పార్క్ పరిధిలోని 3.15 ఎకరాలకు మరో విడుదల వేలం చేపట్టారు. రెండు చోట్లా బిడ్డర్ల నుంచి స్పందన రాకపోవడంతో వేలాన్ని రద్దు చేశారు. దానికంటే ముందు జూబ్లీహిల్స్.. బంజారా హిల్స్ ప్రాంతాల్లోని హుడా హైట్స్.. హుడా పార్క్ లేఅవుట్ ప్లాట్ల వేలం కూడా కొనుగోలు ధరలు లేకపోవడంతో నిలిచిపోయింది. ఇలా రెండు రోజుల వ్యవధిలో వరుసగా రెండు భారీ వేలాలు విఫలమయ్యాయి.

భారీ ధరలు అడ్డంకిగా మారాయా

హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయించిన కనీస ధరలు వేలానికి ప్రధాన అడ్డంకిలాగా మారిపోయినట్టు రియల్ ఎస్టేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మూసాపేట ట్రక్ పార్క్ భూములకు ఎకరాకు 99 కోట్ల కనీస ధర నిర్ణయించారు. కోకాపేట నియో పోలీస్ లో ఎకరాకు 120 కోట్లను నిర్ణయించారు. ఈ రెండు భూముల మొత్తం రిజర్వ్ ధర సుమారు 550.80 కోట్లుగా నిర్ణయించారు.

గతంలో కోకాపేట భూములకు భారీ ధరలు లభించినప్పటికీ.. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని బిల్డర్లు భావిస్తున్నారు. ఎకరానికి 100 కోట్లకు పైగా వెచ్చించి భూముల కొనుగోలు చేసిన తర్వాత నిర్మించే ప్రాజెక్టులకు తగిన ధరలు లభిస్తాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి కొనుగోలు ధరలకు అందుబాటులో ఉండే విధంగా ప్రాజెక్టులను రూపొందించడం కష్టమవుతుందని భావించి పెట్టుబడిదారులు ఆసక్తి చూపలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మూసాపేట భూములపై వివాదాల ప్రభావం

మూసాపేట ట్రక్ పార్క్ భూముల వేలానికి సంబంధించి రాజకీయ, న్యాయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ భూముల విక్రయాన్ని భారత రాష్ట్ర సమితి వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు కొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. వేలం ప్రక్రియపై కోర్టు మద్యంతర స్టే విధించింది. అయితే వివాదాలు ఉన్న భూముల మీద భారీ పెట్టుబడి పెట్టడానికి కొనుగోలుదారులు వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు మార్కెట్లో అమ్ముడుపోని నిర్మాణాలు.. ప్రాజెక్టుల నిల్వలు పెరిగిపోతున్నాయని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆర్థికంగా మందగమన పరిస్థితులు ఎదురు కావడం.. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ విధించిన 60 రోజుల్లోనే పూర్తి చెల్లింపులు నిబంధన ఉండడంతో పెట్టుబడిదారులకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ అంచనాలకు ఎదురు దెబ్బ

భూముల విక్రయాల ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని భావించిన ప్రభుత్వానికి తాజా పరిణామాలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. గతంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో నమోదైన అధిక ధరలను ఆధారంగా తీసుకొని ప్రస్తుత వేలానికి కూడా అదే స్థాయిలో స్పందన వస్తుందని అంచనా వేసినట్టు తెలుస్తోంది. తాజా వేలంలో ఒక్క బిట్టు కూడా దాఖలు కాకపోవడం మార్కెట్ పరిస్థితుల పై చర్చకు దారితీస్తోంది. కోకాపేట, మూసాపేట వంటి కీలక ప్రాంతాల్లోనే కొనుగోలుదారులు ఆసక్తి చూపించకపోవడంతో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ తదుపరి నిర్ణయాలపై ఉత్కంఠ ఏర్పడింది. రిజర్వ్ ధరలను తగ్గించి మరోసారి వేలం నిర్వహిస్తారా.. లేక ఇప్పుడు ఉన్న ధరలతోనే ముందుకు వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో చర్చకు దారి తీస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper