HomeతెలంగాణHyderabad Real Estate: హైదరాబాదులో సొంత ఇల్లు కంటే.. అద్దె ఇల్లే నయం.. ఈ జర్నలిస్ట్...

Hyderabad Real Estate: హైదరాబాదులో సొంత ఇల్లు కంటే.. అద్దె ఇల్లే నయం.. ఈ జర్నలిస్ట్ బాధ ఎందరికో పాఠం..

Hyderabad Real Estate: హైదరాబాదులో సొంత ఇల్లు ఉండాలని చాలామంది కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు.. యావత్ దేశానికే హైదరాబాద్ రెండవ ఆర్థిక రాజధాని. ఇక్కడ బతకడం ఈజీ. జీవితాన్ని సాఫీగా సాగించడం ఈజీ. అందువల్లే హైదరాబాద్ కు అలవాటు పడ్డవారు.. ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడరు. హైదరాబాదు నగరంలో చాలామంది ఇతర ప్రాంతాలకు చెందినవారు ఉంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సామెతకు హైదరాబాదు నగరం నూటికి నూరు శాతం సరిపోతుంది. అయితే ఈ నగరంలో […]

Hyderabad Real Estate: హైదరాబాదులో సొంత ఇల్లు ఉండాలని చాలామంది కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు.. యావత్ దేశానికే హైదరాబాద్ రెండవ ఆర్థిక రాజధాని. ఇక్కడ బతకడం ఈజీ. జీవితాన్ని సాఫీగా సాగించడం ఈజీ. అందువల్లే హైదరాబాద్ కు అలవాటు పడ్డవారు.. ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడరు.

హైదరాబాదు నగరంలో చాలామంది ఇతర ప్రాంతాలకు చెందినవారు ఉంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సామెతకు హైదరాబాదు నగరం నూటికి నూరు శాతం సరిపోతుంది. అయితే ఈ నగరంలో ఎన్ని సానుకూలతలు ఉన్నాయో.. అదే స్థాయిలో ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాల వల్ల హైదరాబాద్ నగరంలో ఒక మధ్య తరగతి ఉద్యోగి ఇల్లు కొనుగోలు చేయడం అత్యంత కష్టంగా మారింది. దీనికి సంబంధించి ఒక పాత్రికేయుడు ఎదుర్కొన్న ఇబ్బంది ఎంతోమందికి గుణపాఠం లాగా మారింది.

ఓ చానల్లో పనిచేస్తున్న అతనికి.. చాలా అనుభవమే ఉంది. పర్వాలేదు అనే స్థాయిలో అతనికి జీతం ఉంది. సొంత ఇల్లు కొనుగోలు చేయడానికి అతడు శ్రీనగర్.. మధురానగర్.. అమీర్పేట్.. కమలాపురి కాలనీ.. పంజాగుట్ట.. ఎల్లారెడ్డి గూడ. నాగార్జున నగర్.. యూసఫ్ గూడా వంటి ప్రాంతాలలో దాదాపు 60 ప్రాపర్టీలు చూశాడు.. 99 ఎకరాస్.. నో బ్రోకర్.. మ్యాజిక్ బ్రిక్స్ వంటి సైట్ లో ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్నాడు. 60 ప్లాట్లలో అతనికి 60 రకాలుగా అనుభవం ఎదురయింది. ప్రతిచోట కూడా ఒక సమస్య.. ఇన్ని సమస్యల మధ్య ఇటీవల అతడికి ప్లాట్ దొరికింది. 40 లక్షలు చెల్లించాడు… రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో 22a చట్టం అతడికి ఇబ్బందిగా మారింది. తట్టుకోలేక ఇచ్చిన ఆ డబ్బులను తిరిగి తీసుకున్నాడు. ఇలా 60 రకాలుగా అతనికి అనుభవాలు ఎదురు కావడంతో ఇక జన్మలో ఇల్లు కొనుగోలు చేయకూడదని అనుకున్నాడు.

సొంత ఇల్లు కొనుగోలు చేయకపోయినప్పటికీ అతడికి రకరకాల మనుషులు అతడికి ఎదురయ్యారు. ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్లో అతడికి ఎంతో కొంత అనుభవం వచ్చేసింది. లీగల్ హెయిర్ సర్టిఫికెట్.. ఫ్యామిలీ సర్టిఫికెట్.. లింకు డాక్యుమెంట్లు.. ఎన్ కంబ్రెన్స్ సర్టిఫికెట్, అన్ డివైడెడ్ షేర్, సేల్ డెడ్,, అగ్రిమెంట్, రిలీజ్ డిడ్, జిపిఏ, ఎన్పీఏ, లీగల్ వెరిఫికేషన్, బ్యాంకు లోన్, ప్రిన్సిపల్ లోన్ సాంక్షన్, లోన్ వెరిఫికేషన్, అసైన్డ్ ల్యాండ్ ఇలా అన్ని విషయాల మీద ఆయనకు అనుభవం వచ్చింది. ఇన్ని రకాలుగా అనుభవం నేర్చుకున్నప్పటికీ సొంత ఇల్లు మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. చివరికి అద్దె ఇల్లే ఉత్తమం అని నిర్ణయానికి వచ్చాడు. ఎక్కడ సౌకర్యంగా ఉంటే అదే తన సొంత ఇల్లు అని భావించడం మొదలు పెట్టాడు. అందు గురించే హైదరాబాద్ నగరంలో అందరికీ అన్ని దొరుకుతాయి. కోరుకున్నవి మాత్రం దూరమవుతాయి. పాపం ఈ జర్నలిస్టు పరిస్థితి కూడా అదే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper