Homeఆంధ్రప్రదేశ్‌YSRCP: చిన్న చిన్న విజయాలతోనే వైసిపి సంతృప్తి.. పాపం ఎంతటి దుస్థితి..

YSRCP: చిన్న చిన్న విజయాలతోనే వైసిపి సంతృప్తి.. పాపం ఎంతటి దుస్థితి..

YSRCP: ఏపీ రాజకీయాలలో వైసిపి పరిస్థితి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో ఏదైనా ఘోర పరాజయం నుంచి బయట పడేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో అక్కడక్కడ లభించే విజయాలను కూడా పెద్ద రాజకీయ విజయాలుగా ప్రచారం చేసుకుంటున్నది ఆ పార్టీ. కొన్ని పంచాయితీలు.. వార్డులు లేదా డివిజన్లలో సాధించిన విజయాలను రాష్ట్రవ్యాప్తంగా దక్కిన ఆదరణగా సంకేతాలు ఇస్తోంది. ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తున్న మార్పు గతంలో రాష్ట్ర […]

YSRCP: ఏపీ రాజకీయాలలో వైసిపి పరిస్థితి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో ఏదైనా ఘోర పరాజయం నుంచి బయట పడేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో అక్కడక్కడ లభించే విజయాలను కూడా పెద్ద రాజకీయ విజయాలుగా ప్రచారం చేసుకుంటున్నది ఆ పార్టీ. కొన్ని పంచాయితీలు.. వార్డులు లేదా డివిజన్లలో సాధించిన విజయాలను రాష్ట్రవ్యాప్తంగా దక్కిన ఆదరణగా సంకేతాలు ఇస్తోంది.

ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తున్న మార్పు

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన రాజకీయ శక్తిగా ఉన్న వైసిపికి ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ రాజకీయ పరిస్థితిని మార్చేశాయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోను పార్టీ ప్రదర్శన పై చర్చ జరుగుతుంది. పంచాయతీలు.. మున్సిపాలిటీలు.. మండల పరిషత్ లు.. జిల్లా పరిషత్ లలో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే పార్టీ బలాబలాలపై స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్నిచోట లభించిన విజయాలు మాత్రమే ప్రస్తావిస్తూ… మొత్తం ఎన్నికల ఫలితాలను పక్కన పెడుతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఓట్ల శాతం.. స్థానాల సంఖ్య అటువంటి అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది.

క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నమా

వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు వైసిపి కార్యకర్తలపై ప్రభావం చూపిస్తున్నాయి. పలువురు నాయకులు పార్టీని విడిపోవడం.. క్షేత్రస్థాయిలో ఉత్సాహం తగ్గింది అనే ప్రచారం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్నపాటి విజయాలను కూడా ప్రత్యేకంగా ప్రచారం చేయడం ద్వారా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపాలని నాయకత్వం భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఇంకా రాజకీయ పోటీలో కొనసాగుతోంద.. తమకు ప్రజల్లో ఆదరణ ఉందని చెప్పుకునేందుకు స్థానిక ఎన్నికల ఫలితాలను వైసిపి ఉపయోగించుకుంటుందని చర్చ నడుస్తుంది. క్యాడర్లో నిరాశ పెరగకుండా చూడడమే ఈ ప్రచారాల వెనుక ఉద్దేశమని రాజకీయ వర్గాలలో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి…

ఆత్మ పరిశీలన అవసరం

ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను విశ్లేషించుకోవడం ప్రతి రాజకీయ పార్టీకి అత్యంత అవసరం. ప్రజలు ఎందుకు దూరం అవుతున్నారు.. ఏ ప్రాంతాల్లో పార్టీ బలహీన పడింది.. నాయకత్వంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అనే అంశాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పరిమిత విజయాలు మాత్రమే ప్రధానంగా చూపిస్తూ పార్టీ బలాన్ని అంచనా వేసుకుంటే అసలు సమస్యలు గుర్తించడం కష్టమైపోతుంది. సోషల్ మీడియా ప్రచారాలు.. రాజకీయ ప్రకటనలతో కార్యకర్తల్లో తాత్కాలిక ఉత్సాహం తీసుకురావచ్చు. కానీ ప్రజల మద్దతును తిరిగి పొందాలంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గత ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని.. ప్రజల్లో విశ్వసాన్ని పునరుద్ధరించుకునే దిశగా వైసిపి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు అత్యంత కీలకం. స్థానికంగా సాధించిన విజయాలను ప్రచార చేసుకోవడంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper