ENE Repeat: రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ENE రిపీట్’ మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తోంది. అర్బన్ సెంటర్స్ లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి కానీ, మాస్ సెంటర్స్ లో మాత్రం అనుకున్న స్థాయి వసూళ్లు రావడం లేదు. ఉదాహరణకు నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి 4 రోజుల్లో 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ , సీడెడ్ ప్రాంతాలకు కలిపి కనీసం 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. ఓవర్సీస్ లో మాత్రం దుమ్ము లేపింది. మొదటి నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇకపోతే ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత బిజినెస్ జరిగింది?, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునేందుకు ఇంకెంత వసూళ్లను రాబట్టాలి అనేది వివరంగా చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 23 కోట్ల రూపాయిల రేంజ్ లో బిజినెస్ జరిగింది. 4 రోజుల లాంగ్ వీకెండ్ లో ఈ చిత్రానికి 17 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇక బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాడ్నైకి కేవలం 6 కోట్ల రూపాయిలు చాలు అన్నమాట. మొదటి వారం లోపే ఆ మార్కుని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ, ప్రతిష్టాత్మక 100 కోట్ల గ్రాస్ క్లబ్ ని మాత్రం ఈ చిత్రం అందుకోవడం అసాధ్యమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రం ఆశించిన స్థాయి పెర్ఫార్మన్స్ ఇవ్వడం లేదు. కానీ వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్న విశ్వక్ సేన్ కి మాత్రం ఈ సినిమా పెద్ద రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి.