Homeటాప్ స్టోరీస్Telangana Congress Leaders: మొన్న కొండా సురేఖలానే.. నిన్న అనిరుధ్ రెడ్డి.. ఇప్పుడు కోమటిరెడ్డి.. చర్యలుంటాయా?

Telangana Congress Leaders: మొన్న కొండా సురేఖలానే.. నిన్న అనిరుధ్ రెడ్డి.. ఇప్పుడు కోమటిరెడ్డి.. చర్యలుంటాయా?

Telangana Congress Leaders: ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది. ఆరోపణలు చేస్తుంది. నిరసనలు చేపడుతుంది. ఆందోళనలకు పిలుపునిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. అధికార పార్టీ మీద అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా ముఖ్యమంత్రి నాయకత్వం మీద ఎమ్మెల్యేలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు చేపడుతున్నారు. బహిరంగ సమావేశాలలో కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి గనుక భారత రాష్ట్ర సమితిలో ఉండి ఉంటే కేసిఆర్ […]

Telangana Congress Leaders: ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది. ఆరోపణలు చేస్తుంది. నిరసనలు చేపడుతుంది. ఆందోళనలకు పిలుపునిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. అధికార పార్టీ మీద అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా ముఖ్యమంత్రి నాయకత్వం మీద ఎమ్మెల్యేలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు చేపడుతున్నారు. బహిరంగ సమావేశాలలో కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఒకవేళ ఇలాంటి పరిస్థితి గనుక భారత రాష్ట్ర సమితిలో ఉండి ఉంటే కేసిఆర్ తన్ని తరిమేసేవాడు. అప్పట్లో ఈటల రాజేందర్ గులాబీ పార్టీకి ఓనర్లు మేము అన్నందుకు కేసిఆర్ బయటికి పంపించాడు. దానికంటే ముందు తాటికొండ రాజయ్య వ్యవహార శైలి మీద అభియోగాలు రావడంతో మంత్రివర్గం నుంచి కెసిఆర్ తొలగించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇది చేతకాదు. పైగా అధిష్టానం దగ్గర లాబీయింగ్ చేసుకునే వాళ్లకు బ్రహ్మాండంగా పదవులు ఉంటాయి. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి మీద.. అప్పటి మంత్రి కొండా సురేఖ.. ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. సుస్మిత చేసిన వ్యాఖ్యల పట్ల అనేక రకాలుగా చర్చలు.. ఇతర సంప్రదింపులు జరిపిన అధిష్టానం ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకొస్తే సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించింది.

ఇక అప్పటినుంచి సురేఖ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. పైగా గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు క్షమాపణ చెప్పారు. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అలా వ్యవహరించాల్సి వచ్చిందని ఆమె వివరించారు. ఇక కొండా సురేఖ మాదిరిగానే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ.. ప్రజలు ప్రభుత్వం తీరుపై సంతృప్తిగా లేరని ఆయన అనేక సందర్భాలలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా ముఖ్యమంత్రి నేరుగా ప్రస్తావిస్తూ రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. గతంలో ముఖ్యమంత్రిని విమర్శించినందుకే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించారు. అనిరుధ్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా.. అలాంటి అవకాశం ఉందా అనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సహజంగానే నమస్తే తెలంగాణ ప్రాధాన్యం ఇచ్చింది. టీ న్యూస్ నిన్నటి నుంచి ఈ వ్యవహారాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. అయితే కొంతమంది మాత్రం రాజగోపాల్ రెడ్డి గులాబీ పార్టీ కండువా కప్పుకుంటున్నారని అంటున్నారు. మరికొందరేమ వైసీపీలో చేరి.. తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేస్తారని చెబుతున్నారు. అందువల్లే ఆయన రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ఇటీవల నల్గొండలో జరిగిన ఒక సమావేశంలో రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ని కలిశారు. వేదిక మీద కుశల ప్రశ్నలు వేసుకొని కనిపించారు. దీనిని గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులో నెగిటివ్గా ప్రచారం చేసాయి. రాజగోపాల్ రెడ్డి ఒక అడుగు వెనక వేశారని చెప్పుకొచ్చాయి. కానీ యాదృచ్ఛికంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకు నిన్నటి నుంచి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాయి. ఒకవేళ చర్యలు తీసుకుంటే అనిరుద్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారు అనే చర్చ నడుస్తోంది. అనిరుద్ రెడ్డి ఓపెన్ గా మాట్లాడతారు. గులాబీ పార్టీలో కొంతమందికి మినహా మిగతా వారికి అంతర్గత స్వేచ్ఛ ఉండదు. అలాంటి పార్టీలో అనిరుద్ రెడ్డి ఉంటారా అనేది ఒక అనుమానం. ఇక రాజగోపాల్ రెడ్డి కూడా అలాంటి తరహా వ్యక్తిత్వం ఉన్న నాయకుడే. గతంలో ఆయన మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కమలం పార్టీలో చేరారు. 2023లో కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి కమలం పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు. ఒకవేళ గులాబీ పార్టీలోకి వెళితే అప్పుడు ఆయన చేసిన విమర్శలకు సార్ధకత ఉండదు. మొత్తంగా చూస్తే అధిష్టానం వీరిద్దరి మీద చర్యలు తీసుకోకుండా పొమ్మను లేక పొగ పెట్టే సామెతను నిజం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper