kisan vikas patra: డబ్బులను పొదుపు చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే తాము కష్టపడి సంపాదించిన డబ్బుకు ఎలాంటి రిస్కులు లేకుండా మంచి రాబడి రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా షేర్ మార్కెట్.. మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడిన వారికి కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాలు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. అటువంటి వాటిలో ఒకటి కిసాన్ వికాస్ పాత్ర (Kisan Vikas Patra – KVP).
ఈ స్కీమ్ లో ఒకేసారి డబ్బులు పెట్టుబడి పెడితే నిర్మిత మెచ్యూరిటీ సమయానికి ఆ మొత్తం రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు ఒక లక్ష పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ నాటికి రెండు లక్షలు పొందవచ్చు. అయితే వడ్డీ.. మెచ్యూరిటీ వ్యవధి.. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే నిబంధన మీద ఆధారపడి ఉంటాయి.
కిసాన్ వికాస్ పత్రలో ఎలా పనిచేస్తుంది
ప్రస్తుతం (అక్టోబర్ నుంచి డిసెంబర్ 2026) ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 7.5% పట్టి అందిస్తోంది. వడ్డీని ఏటా చక్రవడ్డీతో కలిపి లెక్కిస్తారు.. ఉదాహరణకు మీరు లక్ష పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ మొత్తం రెండు లక్షల వరకు వస్తుంది. వడ్డీ రేటు వార్షికంగా 7.5 వరకు ఉంటుంది. మెచ్యూరిటీ గడువు 115 నెలలు ఉంటుంది. సంవత్సరాల్లో చెబితే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు.
ఈ పథకంలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు
ఈ పథకంలో భారతీయ పౌరులు పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా 18 ఏళ్ల నిండిన వ్యక్తులు సొంతంగా
ఖాతా తెరవవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్దలు కలిసి జాయింట్ ఖాతా తెరవచ్చు. మైనర్ల పేరుతో పేరెంట్స్ లేదా సంరక్షకులు పెట్టుబడి పెట్టవచ్చు . పదేళ్లు నిండిన మైనర్లు కూడా నిబంధనల ప్రకారం సొంతంగా ఖాతా తెరవచ్చు.
కిసాన్ వికాస్ పాత్రలో కనీసం పెట్టుబడి 1000 ఆ తర్వాత 100 గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. అంటే తమ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టిన వెంటనే డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. సాధారణంగా రెండున్నర సంవత్సరాల తర్వాత ముందస్తు నగతీకరణకు అవకాశం ఉంటుంది. అయితే దీనికి పథకం నిబంధనలు.. వర్తించే చెల్లింపు విలువలు వర్తిస్తాయి. ఖాతాదారుడి మరణం.. న్యాయస్థానం ఆదేశాలు వంటి ప్రత్యేక సందర్భాలను ముందస్తు క్లోజర్ కు అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసర అవసరాలకు వెంటనే డబ్బులు కావాల్సిన వారు ఈ అంశాన్ని కచ్చితంగా గుర్తించాలి.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టేముందు పన్నుల గురించి కూడా తెలుసుకోవాలి. పెట్టుబడి మొత్తం పై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉండదు. పెట్టుబడి పై వచ్చే ఇంట్రస్ ఇన్ కమ్ పై ట్యాక్స్ చెల్లించాలి. సాధారణంగా టిడిఎస్ కట్ చేయకపోయినా.. పన్ను రిటర్న్ లో వడ్డీ ఆదాయాన్ని వెల్లడించాలి. మీ ఆదాయపు పన్ను స్లాబ్ ఆధారంగా భారం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కొన్ని బ్యాంకుల్లో ఖాతా తెరవడానికి అవకాశం ఉంది. అవసరమైన కేవైసీ పత్రాలు.. పాన్ కార్డు గుర్తింపు.. చిరునామా వివరాలు సమర్పించాలి.
ఎలాంటి మార్కెట్ రిస్క్ తీసుకోకుండా.. దీర్ఘకాలం పాటు డబ్బును భద్రపరచుకోవాలనుకునే వారికి కిసాన్ వికాస్ పత్ర ఒక ప్రత్యామ్నాయం. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ముందుగానే నిర్ణయించిన మెచ్యూరిటీ మొత్తం లభించడం దీని ప్రత్యేకత. 9 1/2సంవత్సరాలకు పైగా డబ్బును పెట్టుబడిగా ఉంచాల్సి ఉంటుంది. అత్యవసరంగా డబ్బు అవసరమయ్యే అవకాశం ఉన్నవారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వంటి మార్కెట్ ఆధారిత పెట్టుబడులతో పోలిస్తే రాబడిలో భిన్నంగా ఉంటాయి. వాటిలో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. కిసాన్ వికాస పత్రలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బు డబుల్ అవుతుంది. కానీ అది వెంటనే జరిగేది కాదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 115 నెలల సమయం పడుతుంది. పెట్టుబడి పెట్టేముందు పోస్ట్ ఆఫీస్ లేదా అధికారికా వెబ్సైట్లో తాజా వడ్డి రేటు.. నిబంధనల గురించి పరిశీలించాలి.