KTR:కేటీఆర్.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా.. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా.. ఇలా అనేక పాత్రలను పోషించారు. ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా.. గులాబీ పార్టీకి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. కేటీఆర్ పేరు గుర్తుకొస్తే నీట్ షేవ్ తో కనిపిస్తారు. ఫార్మల్ డ్రెస్సులు.. విదేశాలకు వెళ్ళినప్పుడు సూటు బూటు ధరించి కనిపిస్తారు.
హ్యాండ్సమ్ లుక్ లో కనిపించే కేటీఆర్ ఇప్పుడు మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. గడ్డం.. మీసాలు పెంచి ఎప్పుడూ చూడని విధంగా రగ్గ్ డ్ లుక్ లో దర్శనమిస్తున్నారు. కేటీఆర్ అలా కనిపించడం వెనక కూడా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా చర్చ నడుస్తోంది. కొద్దిరోజుల క్రితం కేటీఆర్ పెంచిన గడ్డం, మీసం గురించి పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయనను ట్రోల్ చేశారు. గడ్డాలు, మీసాలు పెంచడానికి కేటీఆర్ భారీగా డబ్బు ఖర్చుపెట్టారని కొంతమంది విమర్శించారు. దీని కోసం ఆయన రకరకాల సర్జరీలు చేసుకున్నారని.. అయితే ఇందులో కొన్ని విఫలమైనట్టు కాంగ్రెస్ నాయకులు మీడియా ముందు విమర్శించారు. దీనిపై కేటీఆర్ కోర్టు దాకా వెళ్లారు. కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు కూడా తెచ్చుకున్నారు.
కేటీఆర్ గడ్డాలు, మీసాలు పెంచి జనాల్లోకి వస్తున్నారు. ఆయన లుక్ ను గులాబీ పార్టీ నాయకులు పాజిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. కొత్త లుక్ లో కేటీఆర్ సరి కొత్తగా కనిపిస్తున్నారు. అయితే కేటీఆర్ గడ్డం, మీసాలు పెంచడం వెనక అసలు స్టోరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటపెట్టారు. కేటీఆర్ ఆమధ్య కొంతమంది వ్యక్తులతో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టారట. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కంటే నాకెం తక్కువ అన్నారట. దానికివారు సార్ మీకు మీసం లేదు.. గడ్డం కూడా లేదు అన్నారట. అప్పటినుంచి కేటీఆర్ గడ్డాలు.. మీసాలు పెంచడం మొదలుపెట్టారట. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి శనివారం జరిగిన ఓ సభలో బయటపెట్టారు. “పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే.. ఆ తర్వాత దెబ్బ తినేది నక్క మాత్రమే అని.. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క ఎన్నటికీ పులి కాదని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గడ్డాలు.. మీసాలు పెంచినంత మాత్రాన కేటీఆర్ ఎన్నటికీ రేవంత్ రెడ్డి కాలేడని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ను ఉద్దేశించి ఈ స్థాయిలో విమర్శలు చేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరి దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు.. గులాబీ పార్టీ నాయకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారు చూడాల్సి ఉంది. ఇటీవల కాలంలో తనను ఉద్దేశించి వ్యక్తిగతంగా ఎవరూ విమర్శలు చేయకూడదని కేటీఆర్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. మరి ఇలాంటి అప్పుడు కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ విమర్శలు చేశారు. ఈ సమయంలో రేవంత్ కు కేటీఆర్ ఎలాంటి జవాబు చెబుతారు.. ఏ రూపంలో చెబుతారు.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.