Sonia Gandhi: బిలాంగింగ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. పుస్తకావిష్కరణలో రాహుల్ గాంధీ ఉద్వేగంగా మాట్లాడటం.. తన తల్లిదండ్రులను ఈ దేశం కోసం అన్ని కోల్పోయిన వ్యక్తులుగా చిత్రీకరించడం.. ఆ కార్యక్రమానికి హాజరైన వారంతా కన్నీరు పెట్టుకోవడం.. వంటివి కనిపించాయి. వేదిక మీద బిజెపి నాయకుడు అమరేందర్ సింగ్ కనిపించడం కూడా కాస్త చర్చకు దారి తీసింది.
సోనియాగాంధీ పుస్తకం రాశారు అంటే చాలామందిలో పివి నరసింహారావు గురించి ప్రస్తావన ఉందా అనే ప్రశ్న వ్యక్తమౌతూ ఉంటుంది. అయితే వీటికి సోనియాగాంధీ ఒక క్లారిటీ ఇచ్చారు. రాజు గాంధీ హత్యకు గురైనప్పుడు.. జరిగిన దర్యాప్తు మీదనే సోనియాగాంధీకి పివి నరసింహారావుకు విభేదాలు వచ్చాయట.. ఆ విభేదాలు చివరి వరకు కూడా కొనసాగాయి. 2004లో పీవీ నరసింహారావు చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రానివ్వలేదు. ఆయన చేసిన ఆర్థిక సేవలను గుర్తించి కనీసం భారతరత్న పురస్కారం కూడా ఇవ్వలేదు. 2024లో బిజెపి ప్రభుత్వం పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇచ్చింది.. పీవీ నరసింహారావు జయంతి లేదా వర్ధంతిని ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహించదు. పైగా పీవీ నరసింహారావు ప్రస్తావన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకురాలేరు. తెలుగువాడు.. అత్యున్నత ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ కనీసం గౌరవం ఇవ్వలేదనేది ఇప్పటికీ అందరికీ తెలిసిందే. సోనియాగాంధీ ఏదో పుస్తకంలో రాజీవ్ హత్య కేసు గురించి ప్రస్తావించినంత మాత్రాన .. నిజాలు అబద్ధాలు అయిపోవని పీవీ అభిమానులు చెబుతున్నారు.
సోనియాగాంధీ పుస్తకంలో తెలంగాణ.. తెలుగు అనే పదాలు కనిపించలేదు. 638 పేజీల పుస్తకంలో ఒక్కసారి కూడా ప్రస్తావన రాలేదు. 2009 డిసెంబర్ ప్రకటన గురించి చర్చ లేదు. 2014 రాష్ట్ర విభజన గురించి మాట్లాడలేదు. రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పతనం.. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికరణకి రావడం వంటి విషయాలను సోనియా గాంధీ ప్రస్తావించలేదు. ఏడు చోట్ల మాత్రం ఏపీ పేరును ప్రస్తావించారు. నెహ్రూ.. గాంధీ కుటుంబంలో జరిగిన విషయాలకు మాత్రమే సోనియా గాంధీ ప్రాధాన్యమిచ్చారు. ఇందిరాగాంధీ జైల్లో ఎందుకున్నారు.. అనే విషయాన్ని ప్రస్తావించకుండా.. ఆమె ఏదో దేశం కోసం సేవ చేసి జైలుకు వెళ్లినట్టు సోనియా గాంధీ ఆ పుస్తకంలో ప్రస్తావించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇందిరా గాంధీ ని పదవి నుంచి దించడానికి జయప్రకాష్ నారాయణ్ నీలం సంజీవరెడ్డికి పంపిన సందేశాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పసిగట్టిన విధానం.. ఇందిరకు చేరవేసిన తీరును సోనియాగాంధీ తన పుస్తకంలో ప్రస్తవించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి.. సీనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబు నాయుడు.. కెసిఆర్.. జగన్మోహన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి.. చెన్నారెడ్డి.. రోశయ్య.. కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి పేర్లు సోనియా గాంధీ రాసిన పుస్తకంలో లేవు. 2004లో కాంగ్రెస్ పార్టీ కూటమికి 218 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 29 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. కాని వాటి గురించి సోనియాగాంధీ తన పుస్తకంలో చెప్పలేదు. సోనియా గాంధీ తన జీవితంలో ఉపాధి హామీ చట్టం గొప్ప తృప్తి ఇచ్చిన పథకం అని చెప్పారు. కానీ ఆ పథకం అనంతపురంలో ప్రారంభించిన విషయాన్ని సోనియా గాంధీ ప్రస్తావించలేదు..