Homeబిజినెస్Honda CRV eFCEV: పెట్రోల్ లేదు.. చార్జింగ్ అవసరం లేదు.. ఐదు నిమిషాల్లో ట్యాంక్ ఫుల్..

Honda CRV eFCEV: పెట్రోల్ లేదు.. చార్జింగ్ అవసరం లేదు.. ఐదు నిమిషాల్లో ట్యాంక్ ఫుల్..

Honda CRV eFCEV: కార్ల ప్రపంచం వేగంగా మారుతోంది. ఒకప్పుడు పెట్రోల్.. డీజిల్ కార్లదే ఆధిపత్యం. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ మొత్తాన్ని శాసిస్తున్నాయి. టెస్లా.. బి వై డి వంటి కంపెనీలు బ్యాటరీ కార్లతో ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో కొత్త పోటీని సృష్టిస్తున్నాయి. అయితే జపాన్ దేశానికి చెందిన honda మాత్రం మరో కొత్తదారిని ఎంచుకుంది .అదే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ. పెట్రోల్ పోయాల్సిన అవసరం లేదు. గంటల తరబడి ఛార్జింగ్ కోసం ఎదురుచూడాల్సిన […]

Honda CRV eFCEV: కార్ల ప్రపంచం వేగంగా మారుతోంది. ఒకప్పుడు పెట్రోల్.. డీజిల్ కార్లదే ఆధిపత్యం. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ మొత్తాన్ని శాసిస్తున్నాయి. టెస్లా.. బి వై డి వంటి కంపెనీలు బ్యాటరీ కార్లతో ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో కొత్త పోటీని సృష్టిస్తున్నాయి. అయితే జపాన్ దేశానికి చెందిన honda మాత్రం మరో కొత్తదారిని ఎంచుకుంది .అదే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ.

పెట్రోల్ పోయాల్సిన అవసరం లేదు. గంటల తరబడి ఛార్జింగ్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. కేవలం 3 నుంచి 5 నిమిషాల్లో హైడ్రోజన్ నింపుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టవచ్చు. అంతేకాదు ఈ కారు నుంచి వెలుపడే ప్రధాన ఉత్పత్తి నీటి ఆవిరి మాత్రమే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ఈ టెక్నాలజీకి ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా ఆదరణ లభించడం లేదు. అసలు హోండా తీసుకొచ్చిన ఈ కారు ప్రత్యేకతలు ఏమిటి.. ఇంత మంచి టెక్నాలజీ ఉన్నా.. కొనుగోలుదారుడు ఎందుకు ఆసక్తి చూపించడం లేదు. భారత్లో హైడ్రోజన్ కార్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..

హోండా కంపెనీ తీసుకొచ్చిన ఈ కారు పేరు CR – V e: FCEV.. FCEV అంటే ఫ్యూయల్ ఎలక్ట్రిక్ వెహికల్. సాధన ఎలక్ట్రిక్ కార్లలో పెద్ద బ్యాటరీ లో విద్యుత్ నిలువచేసే మోటార్ ను నడుపుతారు. కానీ హైడ్రోజన్ కార్లో మాత్రం ప్రత్యేకమైన ఫ్యూయల్ సెల్ వ్యవస్థ ఉంటుంది.

ఈ కారులో అధిక పీడనంతో హైడ్రోజన్ ను నిల్వ చేస్తారు. ఫ్యూయల్ సెల్ లో హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్ మధ్య రసాయన చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్తుతో ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో నీరు లేదా నీటి ఆవిరి ఉప ఉత్పత్తిగా బయటికి వస్తూ ఉంటుంది. అంటే ఇది కూడా ఎలక్ట్రిక్ కారే. కాకపోతే విద్యుత్తును బయట నుంచి పూర్తిగా చార్జ్ చేసుకోవడం కాకుండా కారులోనే హైడ్రోజన్ సహాయంతో ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది.

ఈ కారు ప్రత్యేకతలు ముఖ్యమైనది రీ ఫ్యూయలింగ్ సమయం. సాధారణ ఎలక్ట్రిక్ కార్లను చార్జింగ్ చేయడానికి కొన్ని గంటలు పట్టవచ్చు. కానీ హోండా CR – V e: FCEV లో హైడ్రోజన్ నింపడానికి కేవలం 3 నుంచి 5 నిమిషాలు సరిపోతుందని కంపెనీ చెబుతోంది.. ఎలక్ట్రిక్ మోటార్ సామర్థ్యం 174 హార్స్ పవర్. టార్క్ 229 Ib -ft. బ్యాటరీ సామర్థ్యం 17.7 kWh. హైడ్రోజన్ ట్యాంక్ సామర్థ్యం 435 కిలోమీటర్లు కేవలం బ్యాటరీతో ప్రయాణించే దూరం సుమారు 47 కిలోమీటర్లు. హైడ్రోజన్ రీ ఫ్యూయలింగ్ సమయం మూడు నుంచి ఐదు నిమిషాలు. ఈ కారును ప్లగ్ ఇన్ చేసుకోడా చార్జింగ్ చేసుకోవచ్చు. అంటే హైడ్రోజన్ తో పాటు బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ డ్రైవింగ్ సౌకర్యం కూడా ఇందులో ఉంటుంది.

ఇన్ని అనుకూలతలో ఉన్నప్పటికీ ఈ కారుకు సంబంధించి అమ్మకాలు ఇప్పటివరకు కేవలం 185 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. ఎలక్ట్రికల్ లకు చార్జింగ్ స్టేషన్లు క్రమంగా పెరిగిపోతున్నాయి. కానీ హైడ్రోజన్ నింపే స్టేషన్లు మాత్రం చాలా తక్కువ. అమెరికాలో కూడా ఈ కారు కాలిఫోర్నియాలోని ఎంపీ చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. హైడ్రోజన్ స్టేషన్ల కొరత కొనుగోలుదారులకు పెద్ద సమస్యగా ఉంది. హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడం.. నిల్వ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి పెద్ద మొత్తంలో పునరుత్పాదక విద్యుత్ అవసరం. దీనివల్ల ఖర్చులు పెరిగిపోతాయి. ఫ్యూయల్ సెల్ టెక్నాలజీకి ప్రత్యేకమైన పరికరాల అవసరం. హైడ్రోజన్ ను అధిక పీడనం వద్ద నిల్వ చేయాలి. ఈ వ్యవస్థ తయారీ.. నిర్వాహన కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. టెస్లా.. డీవీడీ వంటి కంపెనీలు బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్లను పెద్ద సంఖ్యలో తయారు చేస్తున్నాయి. చార్జింగ్ నెట్వర్క్ కూడా విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో హైడ్రోజన్ కార్లు సాధారణ కస్టమర్లను ఆకర్షించడం కష్టంగా మారుతుంది.

భారత్ కూడా హైడ్రోజన్ టెక్నాలజీ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను అమలు చేస్తోంది. దీని లక్ష్యం హైడ్రోజన్ ఉత్పత్తి వినియోగం.. ఎగుమతుల్లో భారత్ ను కీలక కేంద్రంగా మార్చడం.. 2026 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాలు ప్రకారం హైడ్రోజన్ ఆదరిత రవాణా కోసం 12 పైలెట్ ప్రాజెక్టులను చేపట్టింది. వీటి ద్వారా 70 హైడ్రోజన్ వాహనాలు.. 16 రి ఫ్యూయలింగ్ స్టేషన్లను 21 మార్గాల్లో ఏర్పాటు చేసే ప్రణాళిక ఉంది. ఇందులో 27 బస్సులు.. 43 ట్రక్కులు ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి మనదేశంలో హైడ్రోజన్ టెక్నాలజీ ప్రధానంగా భారీ వాహనాల విభాగంలో మాత్రమే పరీక్షిస్తున్నారు. నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం భవిష్యత్తులో భారీ ట్రక్కులు.. బస్సులు వంటి ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాలకు హైడ్రోజన్ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా 2035 తర్వాత బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు అనుబంధంగా హైడ్రోజన్ వాహనాలు కీలక పాత్ర పోషించే అవకాశాన్ని నీతి అయోగ్ ప్రస్తావించింది.

హోండా CR -V e:FCEV ఒక ఇంట్రెస్టింగ్ టెక్నాలజీకి నిదర్శనం. పెట్రోల్ అవసరం లేకుండా.. తక్కువ సమయంలో రి ఫ్యూయలింగ్ చేసుకుని అవకాశం ఉండడం దీని బలం. అయితే హైడ్రోజన్ తయారీ ఖర్చులు తగ్గాలి. రీ ఫ్యూయలింగ్ స్టేషన్లు పెరగాలి. వాహనాల ధరలు అందుబాటులోకి రావాలి. అప్పుడే ఈ టెక్నాలజీ సామాన్లకు దగ్గరవుతుంది. ప్రస్తుతానికి బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో ముందు వరుసలు ఉన్నాయి. కానీ భవిష్యత్తులో భారీ వాహనాలు.. సుదూర ప్రయాణాలకు హైడ్రోజన్ ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంది. మరి రాబోయే రోజుల్లో హోండా ఎంచుకున్న ఈ కొత్త దారి విజయవంతమవుతుందా.. టెస్లా, బివైడి కార్లదే ప్రపంచ వ్యాప్త ఆధిపత్యం కొనసాగుతుందా.. అనేది ఆసక్తికరంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper