Meta Muse Voice Transcribe : మెటా సూపర్ ఇంటలిజెన్స్ ఇటీవల కొత్త ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. ఏఐ ఆధారితంగా పనిచేసే ఈ ఆప్షన్తో మనం మాట్లాడే మాటలతో టెక్స్ట్ గా మార్చుకోవచ్చు. ఇప్పటివరకు ఒక ఆడియోను టెక్స్ట్ గా మార్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాట్లాడుతుండగానే కావాల్సిన పదాలు రెడీ అవుతాయి. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 70 భాషలను ఎంచుకోగా.. ఇందులో భారతదేశానికి చెందిన ఐదు ప్రముఖ భాషలను కూడా చేర్చారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
మెటా సూపర్ ఇంటలిజెన్స్ కొత్తగా ‘మస్క్ వాయిస్ ట్రాన్సాక్షన్’అనే కొత్త ఆప్షన్ ను పరిచయం చేసింది. ఇందులో ఒక వ్యక్తి మాట్లాడుతుండగా ఆ మాటలు టెక్స్ట్ రూపంలో మారిపోతాయి. దీంతో వాయిస్ డిక్టేషన్, మీటింగ్స్, ఇంటర్వ్యూలు.. ఎదుటివారికి అర్థమయ్యే విధంగా పదాల రూపంలో పంపించడానికి ఇది చాలావరకు ఉపయోగపడుతుంది. ఒకేసారి ఇందులో 20 మంది మాట్లాడినా కూడా ఎవరు ఏ విధంగా మాట్లాడారో గుర్తించి.. వారికి అనుగుణంగా పదాలను అందిస్తుంది. అంతేకాకుండా పెద్ద సైజు ఆడియోను కూడా టెక్స్ట్ రూపంలో మారుస్తుంది.
ఈ ఆప్షన్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 70 భాషలలో పనిచేస్తుంది. ప్రస్తుతం 25 భాషలను ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో విశేషం ఏంటంటే భారతదేశానికి చెందిన ఐదు భాషలు ఉన్నాయి. వాటిలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడం ఉన్నాయి. అంటే ఇప్పుడు తెలుగులో ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొన్ని సెకండ్ల పాటు తెలుగులో మాట్లాడి ఆ తర్వాత హిందీకి మార్చుకొని. మరోసారి ఇంగ్లీషు రూపంలో పంపించాలంటే కూడా ఇది సపోర్ట్ గా ఉంటుంది. ఇలా నిరంతరంగా 80 మిల్లి సెకండ్ల చంక్స్ గా పనిచేస్తుంది. అయితే క్లిష్టమైన పదాలు కాస్త పొరపాటు అయితే దానిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని మెటా తెలిపింది. అంతేకాకుండా కొన్ని భాషల్లో ఉండే ప్రత్యేక పదాలు కూడా అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఒకవేళ రాకపోతే వాటిని సరి చేసుకోవాలని పేర్కొంది.
అయితే ఇప్పటికే మెటా కు సంబంధించిన కొన్ని యాప్ లో ఇలా వాయిస్ రికార్డింగ్ టూ టెక్స్ట్ వాడుతున్నారు. కానీ ఇప్పుడు డెవలపర్లు కూడా దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే వీరు ప్రత్యేకంగా పే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ కావాలని అనుకునే వారికి 1000 ఆడియో నిమిషాలకు 3 డాలర్లుగా నియమించింది. గంటకు 0.18 డాలర్లు గా పేర్కొంది. ఎక్కువ మొత్తంలో వాయిస్ రికార్డింగ్ చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది.