Whatsapp: తెలియని విషయాన్ని ఒకప్పుడు పెద్దవాళ్ళను అడిగి తెలుసుకునే వాళ్ళం. ఇంకా కఠిన విషయమైతే ఉపాధ్యాయులను సంప్రదించేవాళ్ళం.. అప్పటికి అర్థం కాకుంటే పుస్తకాలను తిరిగేసే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎలాంటి సందేహం వచ్చినా గూగుల్ తల్లి ని అడిగేస్తున్నాం. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత టైప్ చేసేస్తున్నాం. అయితే ఇకపై గూగుల్ కూడా అవసరం లేదు. జస్ట్ వాట్సప్ అకౌంట్ ఉంటే చాలు. ప్రతి విషయాన్ని అందులోనే శోధించవచ్చు. మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవచ్చు. నాలుగు బిలియన్ల యూజర్లతో ప్రపంచంలోనే తిరుగులేని మెసేజింగ్ యాప్ గా వాట్సప్ అలరారుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చేపడుతూ యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. అయితే ఇప్పుడు వాట్సప్ మాతృ సంస్థ మెటా మరో కొత్త ప్రయోగం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో meta AI ని అందుబాటులోకి తెచ్చింది.
కేవలం వాట్సాప్ మాత్రమే కాదు, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకు కుడివైపు కింది భాగంలో ఒక రింగ్ లాంటి ఆకృతి ఈ మధ్యన దర్శనమిస్తోంది. ఐ ఫోన్ యూజర్లకు మాత్రం డిస్ ప్లే పై భాగంలో కెమెరా ఐకాన్ పక్కన ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. వెబ్ వాట్సాప్ లోనూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రొఫైల్ పిక్ పక్కనే దర్శనమిస్తుంది. మెటా తీసుకొచ్చిన ఈ ఏఐ సదుపాయం ద్వారా మనకు కావాల్సిన సమాచారాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఆ రింగ్ లాంటి ఆకృతిపై క్లిక్ చేస్తే సరిపోతుంది.. వెంటనే ఒక చాట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్లి మనకు కావాల్సిన సమాచారాన్ని వెతకొచ్చు .. ఉదాహరణకి ప్రపంచ వైద్యుల దినోత్సవం ఎన్నడు? వైద్యుల దినోత్సవం రోజు ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేయాలి? అనే ప్రశ్నలను టైప్ చేస్తే చాలు.. వెంటనే ఆ వివరాలను మీ ముందు ఉంచుతుంది.. అంతేకాదు దానికి సంబంధించిన స్పష్టమైన రిఫరెన్స్ లింకులను కూడా ఇస్తుంది.
చిరంజీవి అని టైప్ చేస్తే చాలు.. మెగాస్టార్ నటించిన సినిమాల సమాచారాన్ని మొత్తం సంక్షిప్త రూపంలో మెటా ఏఐ మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పుడు ఏ సినిమాలో ఆయన నటించబోతున్నారు? ఆయన సినిమాలు సాధించిన కలెక్షన్లు ఎన్ని? అన్ని వివరాలను చూపిస్తుంది. అయితే ఇంతటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కళ్ల ముందు ఉంచుతున్నప్పటికీ.. తెలుగు విషయానికి వచ్చేసరికి మెటా ఏఐ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. ఏదైనా ప్రశ్నను తెలుగులో అడిగినప్పుడు.. సమాధానం ఇచ్చేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.. ” తెలుగులో పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నాను.. ప్రస్తుతం నేర్చుకునే స్థితిలో ఉన్నాను” అంటూ మెటా ఏఐ బదులిస్తోంది. సెర్చ్ ఇంజన్లో గూగుల్ నెంబర్ వన్ గా ఉన్న నేపథ్యంలో.. గూగుల్ కు దీటైన పోటీ ఇచ్చేందుకు.. ఫేస్ బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే గూగుల్ కూడా ఇప్పటికే చాట్ బాట్ విభాగంలో జెమినీని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Whatsapp gets meta ai which can do almost anything
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com