iPhone 18 Pro Max : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ తయారీ సంస్థ ఆపిల్.. తన ఉత్పత్తులలో మొదటి ఫోల్డబుల్ ఫోన్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీనికి ఐఫోన్ 18 ప్రో అనే పేరు పెట్టింది. సెప్టెంబర్ 9న ఫ్రీ ఆర్డర్లు మొదలవుతాయని చెప్పినప్పటికీ.. అది సెప్టెంబర్ 12 కు మారబోతోంది.
ఆపిల్ కంపెనీ తీసుకొచ్చే ఫోల్డబుల్ ఫోన్ కు ఐఫోన్ అల్ట్రా అని పేరు పెట్టింది.. చిప్ లు.. ఇతర ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో.. ఈ మోడల్ ధరలు కూడా పెంచినట్టు ఆపిల్ కంపెనీ ప్రకటించింది ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మనదేశంలో సుమారు 1,69,000 లేదా అంతకంటే ఎక్కువగానే ఉండవచ్చని అంచనాల వినిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు ఆపిల్ కంపెనీ విడుదల చేసిన అత్యంత ఖరీదైన నాన్ ఫోల్డబుల్ ఐఫోన్లలో ఒకటిగా నిలవబోతోంది.
కొత్త కెమెరా..
ఐఫోన్ 18 ప్రో మాక్స్ లో అతిపెద్ద కెమెరా అప్డేట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆపిల్ వేరియబుల్ ఆపర్చర్ తో కూడిన 48 ఎంపీ ప్రైమరీ కెమెరాను పరిచయం చేస్తుందని సమాచారం. ఇది తక్కువ కాంతిలో కూడా మెరుగైన ఫోటోగ్రఫీ.. ఎక్కువ డెప్త్ కంట్రోల్ అనుభవాన్ని అందిస్తుంది. సెన్సార్ లోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని ఫోన్ ఆటోమేటిక్గా సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. మొత్తం త్రిబుల్ కెమెరా లేఅవుట్ మారకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. మిగిలిన వెనుక కెమెరాలు కూడా సాఫ్ట్వేర్.. ఇమేజింగ్ మెరుదలను పెంపొందిస్తాయి.
కొత్త రంగులు.. అద్భుతమైన డిజైన్
గత ఫోన్ల తో పోల్చి చూస్తే డిజైన్ విషయంలో ఆపిల్ కంపెనీ పెద్దగా మార్పులు చేయకపోయినప్పటికీ.. రంగుల విషయంలో మాత్రం ఆపిల్ కంపెనీ మార్పులను చేపట్టింది. స్కై బ్లూ.. బ్లాక్.. డార్క్ చెర్రీ వంటి రంగుల్లో మోడల్స్ తీసుకొచ్చింది. ప్రో మోడల్ లో చిన్నపాటి డైనమిక్ ఐలాండ్ రంగు కూడా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
A20 ప్రో చిప్.. పెద్ద బ్యాటరీ
ఐఫోన్ 18 ప్రో మాక్స్ లో ఆపిల్ కంపెనీ ఏ20. ప్రో చిప్ ను ఏర్పాటు చేసింది. దీనిని టీఎస్ ఎంసి 2 ఎమ్ ఎమ్ ప్రాసెస్ ఉపయోగించి తయారు చేసినట్టు తెలుస్తోంది. కొత్త ప్రాసెసర్ మెరుగైన పనితీరును.. అత్యుత్తమ విద్యుత్ సామర్థ్యాన్ని అందిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫోన్లో మునుపటి దానికంటే అతిపెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇది ఏఐ ఫీచర్ల అవసరాలను తీరుస్తుంది. బ్యాటరీ లైఫ్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఆపిల్ కంపెనీ 12gb ర్యామ్ ను కూడా అందుబాటులో వచ్చింది. ఇది ఆన్ డివైస్ ఏఐ సామర్థ్యాలకు దీనిని మరింత అనుకూలంగా మార్చుతుంది.
ఇంకా ఏం ఆశించవచ్చు అంటే
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఐఓఎస్ 27 ద్వారా ఆధారపడి పనిచేస్తుంది. ఆపిల్ తాజా ఏఐ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. ఆపిల్ కంపెనీ మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ను ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో.. దీంట్లో ఫీచర్ల విషయంలో ఆపిల్ కంపెనీ ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.