Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీAI Impact On Jobs: ఏఐ దెబ్బ.. జీతం రెండు లక్షల నుంచి 40 వేలకు...

AI Impact On Jobs: ఏఐ దెబ్బ.. జీతం రెండు లక్షల నుంచి 40 వేలకు పడిపోయింది..

AI Impact On Jobs: ఏ రంగంలోనైనా సరే జీతం అనేది పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే పెరిగిన జీతమే మన పనితీరుకు నిదర్శనం. జీతం పెరిగితేనే మన భవిష్యత్తు బాగుంటుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. ఏ రంగంలోనైనా పనిచేసే ఉద్యోగులు తమ వేతనంలో పెరుగుదల కచ్చితంగా కోరుకుంటారు. వేతనంలో పెరుగులో లేకపోతే ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేనప్పుడు ఆ ఉద్యోగం చేయడం కూడా వృధానే. ఆ మధ్య ఐటీ ఇండస్ట్రీలో ఏఐ క్రైసిస్ ఏర్పడింది. తద్వారా […]

AI Impact On Jobs: ఏ రంగంలోనైనా సరే జీతం అనేది పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే పెరిగిన జీతమే మన పనితీరుకు నిదర్శనం. జీతం పెరిగితేనే మన భవిష్యత్తు బాగుంటుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తూ ఉంటుంది.

ఏ రంగంలోనైనా పనిచేసే ఉద్యోగులు తమ వేతనంలో పెరుగుదల కచ్చితంగా కోరుకుంటారు. వేతనంలో పెరుగులో లేకపోతే ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేనప్పుడు ఆ ఉద్యోగం చేయడం కూడా వృధానే. ఆ మధ్య ఐటీ ఇండస్ట్రీలో ఏఐ క్రైసిస్ ఏర్పడింది. తద్వారా చాలామంది ఉద్యోగులు నరకం చేశారు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికీ కోల్పోతూనే ఉన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో చాలామంది ఉపాధికి దూరంగా జరిగిపోతున్నారు.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది. దీనివల్ల చాలామంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. మీరు చదవబోయే ఈ కథనంలో ఈ వ్యక్తి పరిస్థితి కూడా అటువంటిదే.

ఇతడు కాపీ రైటర్ గా పనిచేసేవాడు. నాడు ఇతడికి 2 లక్షల వరకు వేతనం వచ్చేది. ఎప్పుడైతే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిందో.. ఇతడికి పనిలేకుండా పోయింది. ఫలితంగా ఉద్యోగం పోయింది. ఇప్పుడు అతను తెలంగాణ టూరిజం లో పనిచేస్తున్నాడు. తెలంగాణ టూరిజం ను హ్యాండిల్ చేసే ఒక సంస్థలో చేరాడు. ఇప్పుడు అతని వేతనం నెలకు 40,000 మాత్రమే. దీనిని బట్టి అతని పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఆ ఏజెన్సీలో కొంతకాలం మాత్రమే ఉపాధి ఉంటుంది. గతంతో పోలి చూస్తే అతని ఉద్యోగ స్థాయి పెరిగినప్పటికీ.. అతడి కింద కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ.. వేతన మాత్రం 40 వేలే ఉంది. పైగా గతంతో పోల్చి చూస్తే అతని స్థాయి కూడా పెరిగింది. కానీ వేతనమే 1,60,000 తగ్గింది.

ఆర్టిఫిషియల్ వల్ల క్రియేటివిటీ రంగాలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే కార్టూన్ గీసే వాళ్ళు.. రకరకాల పోస్టర్లు రూపొందించే వాళ్ళు.. గ్రాఫిక్ డిజైనర్లు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు ఏకంగా కాపీ రైటింగ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిర్వహించడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్ కాలంలో పరిస్థితి ఇలాగే ఉంటే.. చాలామందికి ఉపాధి కాదు కదా.. ఎటువంటి అవకాశాలు కూడా ఉండవు. ఉపాధి లేకపోతే చాలామంది రోడ్డును పడాల్సి వస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper