Homeఅంతర్జాతీయంGoogle Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం జరుగుతోంది..

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద భారీగా పెట్టుబడులు పెడుతోంది. మ్యాన్ పవర్ ను దశలవారీగా తగ్గిస్తోంది. ఈ క్రమంలో సంస్థ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి ఉద్యోగుల నుంచి వినూత్నమైన నిరసన […]

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద భారీగా పెట్టుబడులు పెడుతోంది. మ్యాన్ పవర్ ను దశలవారీగా తగ్గిస్తోంది. ఈ క్రమంలో సంస్థ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి ఉద్యోగుల నుంచి వినూత్నమైన నిరసన ఎదురైంది..”సంస్థ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ భాగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఉద్యోగులను ఘోరంగా తొలగిస్తోంది. ఇది సరైన విధానం కాదు. ఉద్యోగులకు మెరుగైన భద్రత కల్పించాలి. కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకురావాలి. లే ఆఫ్ చేయాల్సి వస్తే.. ఉద్యోగులకు స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని వదులుకునే అవకాశాన్ని కల్పించాలి. ఉద్యోగానికి కోల్పోతున్న వారికి సరైన స్థాయిలో సేవరన్స్ ప్యాకేజీ కల్పించాలి. ఉద్యోగుల పనితీరును అంచనా వేయాలి. వారి పనితీరు విధానంలో మార్పులు చేపట్టాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానం వల్ల చాలామంది నష్టపోతున్నారని” ఉద్యోగులు సుందర్ కు ఇచ్చిన వినతిలో పేర్కొన్నారు.

గూగుల్ క్యాంపస్ బయట దాదాపు 100 మంది ఉద్యోగులు ఇలా శాంతియుతంగా నిరసన చేపట్టడం గూగుల్ చరిత్రలోనే అతిపెద్దది. ఉద్యోగ భద్రత కోసం జరిగిన అతిపెద్ద ఉద్యమంలో ఇది ఒకటి అని గూగుల్ సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. సుమారు 4500 మందికి పైగా ఉద్యోగులు సుందర్ పిచాయ్ కి పిటిషన్ ఇవ్వడం విశేషం.. వారంతా కూడా ఏఐ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేశారు. పనులు వేగంగా.. సులభంగా పూర్తవుతున్నప్పటికీ.. తమ భవిత మొత్తం నాశనం అవుతోందని ఆ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్ సంస్థలో గతంలో అనేక సందర్భాలలో ఉద్యోగులు అనేక అంశాల మీద నిరసనలు చేపట్టారు. అయితే ఈసారి మాత్రం కాస్త విభిన్నంగా నిరసన నిర్వహించారు. ఉద్యోగులు మొత్తం తమ ఉద్యోగం గురించే ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. ఏఐ వల్ల జాబ్ మార్కెట్ ఎంతగా ప్రభావితం అవుతుందో గూగుల్ ఉద్యోగుల నిరసన ద్వారా తెలుస్తోందని ఐటి నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు ఈ స్థాయిలో నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో గూగుల్ సంస్థ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper