Homeఉద్యోగాలుAI Impact on Jobs : మరో ఐదేళ్ల తర్వాత జాబ్ లు ఉండవు.. ఏదైనా...

AI Impact on Jobs : మరో ఐదేళ్ల తర్వాత జాబ్ లు ఉండవు.. ఏదైనా సంపాదించుకోవాలంటే ఇప్పుడే సంపాదించుకోండి

AI Impact on Jobs : ఇప్పటికే ఏఐ వచ్చింది.. అనేక రంగాలలో ఊహించని మార్పులు తీసుకొచ్చింది. ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి ఐదు ఉద్యోగాలలో ఒకదానిని ఏఐ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఏఐ వల్లనే చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని అనేక నివేదికలు చెబుతున్నాయి. చాలామంది రోడ్డున పడ్డారు. ఇంకా ఎంతమంది రోడ్డున పడతారో తెలియదు. చాలావరకు కంపెనీలు ఏదో ఉద్యమం చేసినట్టు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు.. ఇప్పుడు పరిస్థితి […]

AI Impact on Jobs : ఇప్పటికే ఏఐ వచ్చింది.. అనేక రంగాలలో ఊహించని మార్పులు తీసుకొచ్చింది. ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి ఐదు ఉద్యోగాలలో ఒకదానిని ఏఐ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఏఐ వల్లనే చాలామంది ఉద్యోగాలు కోల్పోయారని అనేక నివేదికలు చెబుతున్నాయి. చాలామంది రోడ్డున పడ్డారు. ఇంకా ఎంతమంది రోడ్డున పడతారో తెలియదు. చాలావరకు కంపెనీలు ఏదో ఉద్యమం చేసినట్టు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు.. ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. ఇకపై బాగుంటుందని నమ్మకం లేదు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే అన్ని రంగాలు ఈ స్థాయిలో కుదుపులకు గురవుతుంటే.. వచ్చే రోజుల్లో ఆర్టిఫిషల్ జనరల్ ఇంటెలిజెన్స్.. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ వంటివి అందుబాటులోకి రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉదాహరణకు ఒక కోడింగ్ రాస్తున్నప్పుడు.. అది అచ్చం మనిషి మాదిరిగా ఆలోచిస్తుంది. మనిషి కోడింగ్ లో ఎర్రర్స్ ఉంటే దానిని వెంటనే మార్చేస్తుంటాడు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ పని చేయవచ్చు. తద్వారా మనుషుల అవసరం లేకుండానే కార్యకలాపాలు సాగించవచ్చు. దీంట్లో విస్తృతమైన టూల్స్ ఉన్నాయి. ఏఐ వల్లఎంట్రీ లెవెల్.. ఉద్యోగాలు మాత్రమే ప్రభావితమయ్యాయి.. ఏ జి ఐ వల్ల మిడ్ లెవెల్ ఉద్యోగాలు కూడా ప్రభావితం అవుతాయి..

ఆర్టిఫిషల్ సూపర్ ఇంటెలిజెన్స్ వాస్తవిక ప్రపంచాన్ని మన కళ్ళ ముందు మరింత వాస్తవిక కోణంలో ఉంచుతుంది. ఉదాహరణకు సినిమాలలో చూపించే విఎఫ్ఎక్స్ షాట్లను.. ఎటువంటి హంగామా లేకుండానే.. జస్ట్ మన ఇమేజిన్ ద్వారానే రూపొందించవచ్చు. మన మనసులో అనుకున్న ఒక చిత్రాన్ని సంకేతల రూపంలో అందిస్తే ఆర్టిఫిషల్ జనరల్ ఇంటెలిజెన్స్ దానికి రూపం ఇవ్వగలదు. వందలు వేల కోట్ల ఖర్చుతో తీస్తున్న సినిమాలను అత్యంత తక్కువ ఖర్చులో పూర్తి చేస్తుంది. కేవలం సినిమాని కాదు వెబ్సైట్లు.. ఇంకా అనేక రకాల ఐటి కార్యకలాపాలు.. ఇది సులువుగా చేయగలుగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మనుషులు అవసరం లేకుండానే.. మనుషులతో సంబంధం లేకుండానే మనుషుల అవసరాలు తీర్చేస్తుంది.. అందువల్లే ఇలా మస్కి లాంటి వాళ్ళు స్పష్టంగానే చెబుతున్నారు. ఏదైనా సంపాదించాలి అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే ఆ పని చేయండి. వచ్చే రోజుల్లో మీరు చేయడానికి ఏదీ ఉండదు. జస్ట్ మీరు చూస్తూ ఉండడమే.. డబ్బు సంపాదించాలంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో సంపాదించి.. భవిష్యత్తు కాలంలో ఆ నగదును ఎలా ఉపయోగించుకోవాలి అనే కోణంలో మాత్రమే ఆలోచించండి అంటూ.. మస్క్ చెప్పారు. మస్క్ మాటలతో ఓపెన్ ఏఐ సీఈవో కూడా ఏకీభవించడం విశేషం.. టెక్నాలజీలో మార్పులు అనేవి వస్తూనే ఉంటాయని.. వీటిని తట్టుకోని నిలబడ్డ వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఉంటాయని.. ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని బట్టి వచ్చే రోజులు ఏమాత్రం బాగోవని.. అందువల్లే భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper