RK Kotha Paluku: ప్రతి ఆదివారం తన ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరుతో వేమూరి రాధాకృష్ణ సంపాదకీయం రాస్తుంటారు. తాజాగా రాసిన సంపాదకీయంలో సంచలన విషయాలను వెల్లడించారు. అందులో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. తన శైలికి భిన్నంగా రాధాకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల లోపాలను ఇందులో ప్రస్తావించారు.
రాధాకృష్ణ రాసిన రాతలను కచ్చితంగా వైరి పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాధాకృష్ణకు అటు చంద్రబాబు..ఇటు రేవంత్ రెడ్డి దగ్గరైన వ్యక్తులు. పైగా ఎన్నికల సమయంలో ఈ ఇద్దరి అధినేతలకు రాధాకృష్ణ కాస్త దగ్గరగా ఉన్నారని మీడియా వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే దీనిని ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ వచ్చారు రాధాకృష్ణ. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని.. తాను ఎవరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక తాజా కొత్త పలుకులో ఇద్దరు ముఖ్యమంత్రుల మైనస్ పాయింట్లను ప్రధానంగా ప్రస్తావించారు.
రేవంత్ రెడ్డిలో అంతులేని తెగువ ఉందని.. రాజకీయ రణక్షేత్రంలో ప్రత్యర్థులను మాటలతో చీల్చి చెండాడడంలో మాది సీఎం కేసీఆర్ కు ఆయన ఏ మాత్రం తీసి పోరట. అధికారంలో ఉండి కూడా ప్రత్యర్థులను డిఫెన్స్ మోడ్ లో పడవేయ కలిగిన నేర్పరితనం రేవంత్ సొంతమాట. అయితే అందరిని కలుపుకొని వెళ్లడంలో మాత్రం ఆయనకు మైనస్ మార్కులు పడతాయట. ఇబ్బంది ఎదురైనప్పుడు రేవంత్ అఫైర్స్ మార్గాన్ని ఎంచుకుంటారట. రాజకీయాల్లో డిఫెన్స్ కంటే అపెన్స్ ఉండడమే వాంఛనీయమట.
రేవంత్ రెడ్డిలోని ఇదే ధోరణిని రాధాకృష్ణ తప్పు పట్టారు. అంతేకాదు దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. కానీ ఇప్పుడు అదే విషయాన్ని రాధాకృష్ణ ప్రముఖంగా ప్రస్తావించారు. రేవంత్ రెడ్డిలో అలాంటి గుణమే వాంఛనీయమని చెబుతున్నారు. ఎందుకు రాధాకృష్ణ ఇలా మారిపోయారు.. ఒక్కసారిగా లైన్ ఎందుకు మార్చుకున్నారు.. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి వైఖరి పట్ల కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరు కూడా సంతృప్తిగా లేరట. ఒకవేళ ఇదే విషయాన్ని గులాబీ పార్టీ గనుక తనకు అనుకూలంగా మార్చుకొని.. నెగిటివ్ ప్రచారం చేస్తే అప్పుడు రాధాకృష్ణ రాసిన రాతలే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.
ఇక చంద్రబాబు విషయంలో కూడా రాధాకృష్ణ మొహమాటం లేకుండా కొన్ని విషయాలు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు రాజకీయాలు చేస్తారట. రాజకీయాలు మాత్రమే శ్వాసగా జీవిస్తారట. సంక్షేపాలు ఎదురైనప్పుడు చురుగ్గా వ్యవహరిస్తారట. పవర్ లోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయాలకు ప్రాధాన్యం తగ్గిస్తారట. ప్రభుత్వ వ్యవహారాల సమీక్షలతోనే తన సమయం మొత్తం కేటాయిస్తారట. చంద్రబాబులో ఇదే లోపం.. వాస్తవానికి అధికారం ఇచ్చింది రాజకీయాలు చేయడానికి కాదు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి.. అభివృద్ధి చేయడానికి.. సంక్షేమాన్ని ఇవ్వడానికి.. ఇలా కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే అప్పుడు ప్రజలకు నమ్మకం ఎలా కుదురుతుంది.. ఓటు వేసిన ప్రజలకు మరోసారి భరోసా ఎలా ఉంటుంది.. చంద్రబాబులో గతంలో ఇదే గుణాన్ని రాధాకృష్ణ అభినందించారు. కానీ ఇప్పుడు విమర్శిస్తున్నారు.. అంతలోనే రాధాకృష్ణ తన లైను ఎందుకు మార్చుకున్నారు.. ఇప్పుడు ఎందుకు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.. పైగా ఈ సంపాదకీయంలో చంద్రబాబును.. రేవంత్ రెడ్డిని గురు శిష్యులుగా అభివర్ణించడం విశేషం. ఇక దీనిని పట్టుకొని గులాబీ పార్టీ.. వైసిపి ఎంత యాగి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో రాధాకృష్ణ తన రాతల ద్వారా చంద్రబాబు.. రేవంత్ రెడ్డికి ఎంత మంచి చేస్తారో తెలియదు గాని.. ఇలాంటి విషయాలు చెప్పి ప్రత్యర్థి పార్టీలకు బీభత్సమైన బూస్ట్ ఇస్తారు. ఇక మిగతా సంపాదకీయమంటారా.. రాధాకృష్ణ రాసుకుంటూ పోయారు.. అత్యంత సులభంగా.. ఎందుకంటే ఇటువంటి అంశాల మీద రాధాకృష్ణకు విపరీతమైన పట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ పరిణామాలు ఆయనకు కేక్ వాక్ లాంటివి.