Oneplus 16: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రోజురోజుకు ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య విపరీతమైన పోటీ పెరుగుతోంది. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో కంపెనీలు భారీగా అప్ గ్రేడ్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. నిజాబితాలో ఇప్పుడు వన్ ప్లస్ కూడా చేరిపోయింది. త్వరలో oneplus 16 మార్కెట్లోకి రాబోతోంది. ఇందులో ఏకంగా 9000 mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ఈనెల 12న అధికారికంగా లాంచ్ కాబోతోంది.
ఇదే పెద్ద హైలెట్
Oneplus 16 లో 9000 mAh బ్యాటరీ ఉంది. ఇది ఈ ఫోన్లోనే అతిపెద్ద అప్ గ్రేడ్ అని చెప్పవచ్చు. Oneplus 15 లో 7,300 mAh బ్యాటరీ ఉంది. కొత్త మోడల్ లో దీనికంటే 1,700 mAh ఎక్కువ సామర్థ్యం లభిస్తుంది.సాధారణంగా ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించే వారికి బ్యాటరీ విషయంలో మరింత బ్యాకప్ లభిస్తుంది. వీడియో స్ట్రీమింగ్.. గేమింగ్.. కెమెరా వినియోగం.. 5జి డేటా వంటి బ్యాటరీ ఎక్కువగా వినియోగించుకునే పనుల్లో ఈ భారీ కెపాసిటీ ఉపయోగపడుతుంది. వాస్తవ బ్యాటరీ బ్యాకప్ కేవలం కెపాసిటీ పై మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రాసెసర్ సామర్థ్యం.. డిస్ప్లే..రీ ఫ్రెష్ రేట్.. సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్.. నెట్వర్క్ వినియోగం వంటి అంశాలు కూడా బ్యాటరీ మనుగడ ప్రభావం చూపిస్తాయి.
100 W ఫాస్ట్ ఛార్జింగ్..50 W వైర్లెస్ చార్జింగ్
భారీ బ్యాటరీ తో పాటు చార్జింగ్ విషయంలో కూడా oneplus 16 కు హై ఎండింగ్ ఫీచర్లు ఉన్నాయి. లీక్ అయిన స్పెసిఫికేషన్ల ప్రకారం ఫోన్ 100 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 W వైర్లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయవచ్చు. అంటే 9000 mAh లాంటి బ్యాటరీ ఉన్నప్పటికీ చార్జింగ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితిని తగ్గించడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
డిస్ ప్లే ప్రధాన ఆకర్షణ
One plus 16 లో డిస్ ప్లే కూడా ప్రధాన ఆకర్షణగా ఉంది. కంపెనీ సిస్టం వైడ్ 165 Hz రీ ఫ్రెష్ రేట్ ను ధ్రువీకరించింది. కొన్ని గేమ్స్ లలో 185 Hz వరకు రీ ఫ్రెష్ రేట్, 185 ఎఫ్ ఎస్ గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. అధికంగా రీ ఫ్రెష్ రేట్ ఉండడంవల్ల స్క్రోలింగ్.. యానిమేషన్లు.. గేమింగ్ సమయంలో కదలికలు మరింత స్మూత్ గా సాగుతూ ఉంటాయి.
కెమెరా విభాగంలో
కెమెరా విభాగంలో ట్రిబుల్ రియర్ కెమెరా సెట్ అప్ ఇందులో ఉంది.. ఫోన్ వెనుక భాగంలో 200 మెగా ఫిక్సల్ మెయిన్ కెమెరా.. 50 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా.. 50 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా.. త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఇందులో ఉన్నాయి. 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాలో 1/1.4 అంగుళాల సెన్సార్, f/1.6 అపార్చర్ ఇందులో ఉంది.. కెమెరా ప్రాసెసింగ్ కోసం ఒప్పో కి చెందిన Lumo imaging engine ను ఉపయోగించారు. ఈ ఫోన్లో కొత్తతరం qualcomm ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ ను అమర్చారు. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీ జెన్ 6 చిప్ సెట్ అమర్చారు. హై ఎండ్ గేమింగ్.. మల్టీ టాస్కింగ్.. కెమెరా ప్రాసెసింగ్ వంటి పనుల్లో ఫోన్ మంచి పనితీరు కనబరుస్తుంది.
ఈ ఫోన్ చైనాలో 12 GB/ 256 GB, 12 GB/ 512 GB, 16 GB/ 1TB స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. అయితే ఈ ఫోన్ అధికారికంగా ధ్రువీకరించిన సమాచారం ప్రకారం మన దేశంలో విడుదలవుతుందో ఇంతవరకు క్లారిటీ లేదు. కొన్ని నివేదికల ప్రకారం గ్లోబల్ లాంచ్ మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.