Homeబిజినెస్Honda Elevate facelift: అక్టోబర్ 6న కొత్త అవతారం.. డిజైన్, ఫీచర్లు ఊహించని విధంగా.. పూర్తి...

Honda Elevate facelift: అక్టోబర్ 6న కొత్త అవతారం.. డిజైన్, ఫీచర్లు ఊహించని విధంగా.. పూర్తి వివరాలు మీకోసం

Honda Elevate facelift: హోండా కంపెనీ ఉత్పత్తులను ఇష్టపడే వాళ్లకు గుడ్ న్యూస్. కొత్త కొత్త ఫీచర్లను ఆస్వాదించే వారికి అద్భుతమైన వార్త ఇది. ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హోండా కంపెనీ తన మిట్ సైజు ఎస్ యూవీ ఎలివేట్ పేస్ లిఫ్ట్ ను అక్టోబర్ 6న భారత మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఫ్రీ లాంచ్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్ మొత్తాన్ని 21,000 గా హోండా కంపెనీ నిర్ణయించింది. కొత్త ఎలివేట్ ను ప్రపంచంలో […]

Honda Elevate facelift: హోండా కంపెనీ ఉత్పత్తులను ఇష్టపడే వాళ్లకు గుడ్ న్యూస్. కొత్త కొత్త ఫీచర్లను ఆస్వాదించే వారికి అద్భుతమైన వార్త ఇది. ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హోండా కంపెనీ తన మిట్ సైజు ఎస్ యూవీ ఎలివేట్ పేస్ లిఫ్ట్ ను అక్టోబర్ 6న భారత మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఫ్రీ లాంచ్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్ మొత్తాన్ని 21,000 గా హోండా కంపెనీ నిర్ణయించింది. కొత్త ఎలివేట్ ను ప్రపంచంలో తొలిసారిగా భారత్ లోనే హోండా కంపెనీ విడుదల చేయడం విశేషం.

ఫేస్ లిఫ్ట్ లో భాగంగా డిజైన్ మార్పులపై హోండా కంపెనీ దృష్టి పెట్టింది. ఇప్పటివరకు విడుదలైన టీజర్లను చూస్తే ముందు భాగంలో కొత్త కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ లైటింగ్ సిగ్నేచర్ కనిపిస్తోంది. గ్రిల్.. బంపర్ డిజైన్ లో మార్పులు కనిపించాయి.. ప్రస్తుత మోడల్ లో ఉన్న గ్రిల్ పై ఉన్న హోండా లోగోను కొత్త మోడల్ లో కి మార్చారు. కొత్త మోడల్ లో బానెట్ కు మరింత పై భాగాల్లో ఉంచినట్టు తెలుస్తోంది. వెనుక భాగంలో కూడా కనెక్టెడ్ ఎల్ఈడి లాంప్స్.. కొత్త బంపర్ వంటి మార్పులు ఉంటాయని సమాచారం…

ఇంటీరియర్ విషయంలో

క్యాబిన్ విషయంలో హోండా కంపెనీ కీలక అప్ గ్రేడ్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్త కలర్/ బీచ్ ఆఫ్ హోల్ స్టరీ, క్యాబిన్ డీటెలింగ్ లో కీలకమైన మార్పులు.. యాంబియంట్ లైటింగ్ వంటి అంశాలు ఈసారి కొత్తగా ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్ లో టచ్ స్క్రీన్ 10.25 అంగుళాలు ఉంది. అయితే మరికొన్ని నివేదికలు మాత్రం ప్రస్తుత యూనిట్ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో హోండా కంపెనీ అధికారికంగా ప్రకటిస్తే గాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

ఇక ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఫేస్ లిఫ్ట్ లో ఫీచర్ల ప్రకారం పూర్తిగా మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు.. ఫ్యాక్టరీ ఫిటెడ్ 360 డిగ్రీ కెమెరా.. పవర్ట్ కో డ్రైవర్ సీట్, రియర్ సన్ బ్లైండ్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కొత్త క్యాబిన్ ఫినిషింగ్ కనిపిస్తున్నాయి. అయితే వీటిలో ప్రతి ఫీచర్ ఏ వేరియంట్ లో వస్తుంది అనేది ఇంకా పూర్తిగా హోండా కంపెనీ వెల్లడించలేదు.

ప్రముఖమైన ఇంజన్ విషయంలో మాత్రం హోండా కంపెనీ ఎటువంటి సర్ప్రైజ్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం 1.5 లీటర్ నాచురల్ అస్పరేటెడ్ ఇంజన్ కొనసాగుతోందని సమాచారం. ఈ ఇంజన్ సుమారు 121 హెచ్పి పవర్, 145 ఎంఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్.. సివిటి ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు కొనసాగే అవకాశం ఉంది.

హోండా సిటీ లో హైబ్రిడ్ ఆప్షన్ ఉన్నప్పటికీ.. ఎలివేట్ లో ఇప్పటి వరకు అది అందుబాటులో లేదు. ఫేస్ లిఫ్ట్ లో హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ వస్తుందని అధికారికంగా నిర్ధారణ కాలేదు. కాబట్టి అక్టోబర్ 6న లాంచ్ వరకు దీనిపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం హోండా ఎలివేట్ ధర సుమారు 11.80 లక్షల నుంచి మొదలవుతుంది. ఫేస్ లిఫ్టులో అదనపు ఫీచర్లు.. కొత్త డిజైన్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మోడల్ కంటే కొంత ప్రీమియం ధర ఉండే అవకాశం ఉంది. కొత్త ఎలివేట్ అధికారిక ధరలు అక్టోబర్ 6న విడుదలవుతాయి

ఫేస్ లిఫ్ట్ హోండా ఎలివేట్ మిడ్ సైజ్ ఎస్ యు వి సెగ్మెంట్లో మరింత గట్టి పోటీ ఇవ్వబోతోంది. ప్రధానంగా Hyundai creta, Kiya Seltos, Toyota urban cruiser Hyryder, Maruti Suzuki Grand Vista, Volkswagen Taigun, kushaq వంటి మోడల్స్ తో పోటీ పడబోతోంది.

ఇక మొత్తంగా చూస్తే హోండా ఎలివేట్ లో మెకానిక్ మార్పుల కంటే డిజైన్.. ఫీచర్లు.. క్యాబిన్ ప్రీమియం అనుభూతిపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కొత్తగా ఎల్ఈడి లైటింగ్.. కనెక్టెడ్ లుక్.. 360 డిగ్రీ కెమెరా.. వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ఫ్యాక్టరీ నుంచి అందిస్తే ఎలివేట్ మరింత ఫీచర్ రిచ్ గా మరి అవకాశం ఉంది. అయితే ధర ఎంత.. వేరియంటులో ఏ ఫీచర్ ఉంది.. హైబ్రిడ్ వస్తుందా.. కీలకమైన ప్రశ్నలకు అక్టోబర్ ఆరవ తేదీన సమాధానం లభించబోతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper