Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Housing:పేదలకు పట్టాభిషేకం: కేంద్రం, చంద్రబాబు కల్పిస్తున్న గృహ యోగం.. ఎలా నిర్మిస్తున్నారంటే..

Andhra Pradesh Housing:పేదలకు పట్టాభిషేకం: కేంద్రం, చంద్రబాబు కల్పిస్తున్న గృహ యోగం.. ఎలా నిర్మిస్తున్నారంటే..

Andhra Pradesh Housing: 3 లక్షల గృహాలు.. 7,170 కోట్ల ఖర్చు.. గుంటూరు జిల్లా బుర్రిపాలెం కేంద్రం.. ముఖ్యఅతిథిగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ గృహ యోగానికి శ్రీకారం.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. పేదలకు కేవలం లోతట్టు ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు కాకుండా.. మెరక ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తున్నారు. అంతటితో ఆగడం లేదు పేదలకు […]

Andhra Pradesh Housing: 3 లక్షల గృహాలు.. 7,170 కోట్ల ఖర్చు.. గుంటూరు జిల్లా బుర్రిపాలెం కేంద్రం.. ముఖ్యఅతిథిగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ గృహ యోగానికి శ్రీకారం..

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. పేదలకు కేవలం లోతట్టు ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు కాకుండా.. మెరక ప్రాంతంలో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తున్నారు. అంతటితో ఆగడం లేదు పేదలకు అద్భుతమైన గృహాలు నిర్మిస్తున్నారు. కేంద్రం సపోర్టు.. రాష్ట్రం వాటర్ కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికోసం 7170 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీతో ప్రయోగాత్మకంగా 177 గృహాలను నిర్మించబోతున్నారు.

3d కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో మన దేశంలోనే తొలిసారిగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. బుర్రిపాలెం.. ఓబుల నాయుడుపాలెం గ్రామాలలో మొత్తం 14 కోట్ల ఖర్చుతో 177 గృహాలను నిర్మిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 28 నెలల కాలంలో అక్షరాల 5.5 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తిచేసి.. లబ్ధిదారులకు అందజేసింది. వచ్చే మార్చినటుకి 4.2 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తిచేసి.. లబ్ధిదారులకు అందించేందుకు అడుగులు వేస్తోంది.. కేంద్రంతో ఎప్పటకప్పుడు సంప్రదింపులు జరిపి.. రాష్ట్రానికి మూడు లక్షల గృహాలను ఇచ్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంది. త్రీ డి టెక్నాలజీతో గృహాలను రాష్ట్రానికి కేటాయించే విషయంలో కేంద్ర సహాయ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేశారు.

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రానికి 18 లక్షలకు పైగా గృహాలను మంజూరు చేసింది. అయితే జగనన్న కాలనీల పేరుతో గ్రామాలను నిర్మిస్తున్నామని ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం ఊదరగొట్టింది. అంతేకాదు పేదల గృహాలను పూర్తి చేయడంలో దారుణంగా విఫలమైంది ప్రభుత్వమే లబ్దారులకు గృహాలను నిర్మించి ఇస్తుందని డబ్బాలు కొట్టుకుంది. నాటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించిన 3.5 లక్షల గృహాల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అంతేకాదు వేల కోట్ల నిధులు మొత్తం దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గతంలో జరిగిన పొరపాట్లకు ఏమాత్రం అవకాశం లేకుండా పూర్తిగా లబ్ధిదారులు కోరుకున్నట్టుగా నాణ్యమైన గృహాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గృహాలు లేని వారిని గుర్తించేందుకు ఇటీవల అవార్డు ప్లస్ పేరుతో సర్వే కూడా నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల అర్హులైన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ దశలవారీగా గృహాలను నిర్మించి ఇవ్వబోతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper