Homeక్రీడలుక్రికెట్‌IND vs WI: వరల్డ్ కప్ ముందు వెస్టిండీస్ డేంజర్ బెల్స్.. టీమిండియా ఇవే తగ్గించుకుంటే...

IND vs WI: వరల్డ్ కప్ ముందు వెస్టిండీస్ డేంజర్ బెల్స్.. టీమిండియా ఇవే తగ్గించుకుంటే మంచిది

IND vs WI: వెస్టిండీస్ 400 పైగా పరుగులు చేసినప్పటికీ టీమిండియా ఆ లక్ష్యాన్ని చేదించింది. ప్రపంచ రికార్డు సాధించింది. టీం ఇండియా కెప్టెన్ గిల్ ఏకంగా డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ఘనత అతడు సాధించడం ఇది రెండవసారి.. ఈ స్థాయిలో బ్యాటింగ్.. బౌలింగ్ చేసిన జట్టు ఓడిపోతుందని ఎవరైనా అనుకుంటారా.. పర్యాటక జట్టు ముందు తలవంచుతుందని ఎవరైనా అంచనా వేస్తారా.. కానీ అది జరిగింది. వరల్డ్ కప్ ముందు వెస్టిండీస్ డేంజర్ బెల్స్ […]

IND vs WI: వెస్టిండీస్ 400 పైగా పరుగులు చేసినప్పటికీ టీమిండియా ఆ లక్ష్యాన్ని చేదించింది. ప్రపంచ రికార్డు సాధించింది. టీం ఇండియా కెప్టెన్ గిల్ ఏకంగా డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ ఘనత అతడు సాధించడం ఇది రెండవసారి.. ఈ స్థాయిలో బ్యాటింగ్.. బౌలింగ్ చేసిన జట్టు ఓడిపోతుందని ఎవరైనా అనుకుంటారా.. పర్యాటక జట్టు ముందు తలవంచుతుందని ఎవరైనా అంచనా వేస్తారా.. కానీ అది జరిగింది.

వరల్డ్ కప్ ముందు వెస్టిండీస్ డేంజర్ బెల్స్ మోగించింది. టీమిండియా లోపాలను బయటపెట్టింది. ఆకాశంలో విహరిస్తున్న జట్టుకు నేల అంటే ఏంటో చూపించింది. తద్వారా సరికొత్త చర్చ మొదలైంది. టీమిండియాలో మార్పులు.. చేర్పులు చేపట్టాల్సిన అవసరాన్ని కచ్చితంగా అది నొక్కి చెప్పింది. మరి ఇప్పటికైనా మేనేజ్మెంట్ మారుతుందా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.

ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే..

టీమిండియా మూడో వన్డేలో ఓడిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ పూర్తిగా విఫలమైంది. భారత్ వెస్టిండీస్ జట్టు ఇన్నింగ్స్ 40 ఓవర్ల వరకు మ్యాచ్ మీద పట్టు కలిగి ఉంది. చివరి ఓవర్లలో వెస్టిండీస్ పేటలను అడ్డుకోలేకపోయింది.. కెప్టెన్ గిల్ కూడా డెత్ ఓవర్లలో బౌలింగ్ పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించడం విశేషం.

వెస్టిండీస్ కెప్టెన్ హోప్ (162) ను భారత బౌలర్లు అడ్డుకోలేకపోయారు. అతడి ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. కీలక దశలో కూడా అతనిపై భారత బౌలర్లు ఒత్తిడి తేలేకపోయారు.

రెండో వికెట్ కు, అమీర్ జంగ్ 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జంగు 67 పరుగులు చేశాడు. ఈ భాగస్వామ్యం వల్ల 352 ల పరుగుల లక్ష్యం వెస్టిండీస్ జట్టు సాధించగలదు అనే నమకం మిగతా ప్లేయర్లలో వచ్చింది.

ఇక భారత్ కొన్ని క్యాచ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. తద్వారా వెస్టిండీస్ మరింత బలోపేతంగా మారింది. 351 పరుగులు భారీ స్కోర్ అయినప్పటికీ.. సాయంత్రం సమయంలో విపరీతంగా డ్యూ రావడం వల్ల బ్యాటింగ్ ఈజీ అయిపోయింది. గిల్ కూడా డ్యూ కారణంగా వెస్టిండీస్ కు చివర్లో ప్రయోజనం కలిగించిందని వ్యాఖ్యానించాడు.

ఈ సిరీస్లో బుమ్రా కు తోడుగా ఉపయోగించగల బలమైన పేస్ ఆప్షన్ ను గుర్తించడం భారత జట్టుకు ముఖ్యమైన అంశంగా మారింది. మూడో వన్డే ఈ అవసరాన్ని మరోసారి ఎత్తి చూపించింది.

భారత్ 28/2 తో ఇబ్బందులలో ఉన్నప్పుడు. రోహిత్ 92, గైక్వాడ్ 57, రాహుల్ 129* వల్ల భారత్ 351 పరుగులు చేసింది. రాహుల్ చివర్లో అద్భుతంగా ఆడాడు. భారత స్కోరును 350 దాటించారు. మొత్తంగా చెప్పాలంటే భారత్ బ్యాటింగ్ చేసింది. అద్భుతమైన విజయం సాధించగల స్కోర్ అందుకుంది. కానీ డెత్ బౌలింగ్.. ఫీల్డింగ్.. హోప్ ను ఆపలేకపోవడం.. డ్యూ కలిసి రావడం వల్ల మ్యాచ్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా గడ్డమీద త్వరలో వన్డే వరల్డ్ కప్ మొదలు కాబోతున్న నేపథ్యంలో టీం ఇండియాకు ఈ ఓటమి ఒక పెద్ద గుణపాఠం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper