Spirit Movie: ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘స్పిరిట్’. రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. షూటింగ్ కూడా అదే స్పీడ్ లో పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా దీపికా పదుకొనే ని సంప్రదించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె చివరి నిమిషంలో రిజెక్ట్ చేసింది. సందీప్ వంగ సోషల్ మీడియా ద్వారా ఆమెకు చాలా స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు.
అయితే ఈ సినిమా నుండి దీపికా పదుకొనే తప్పుకోవడానికి గల కారణాలను వివరించాడు సందీప్ వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ. ఆయన మాట్లాడుతూ ‘ స్పిరిట్ మూవీ చర్చల్లో దీపికా పదుకొనే సందీప్ తో దాదాపుగా ఏడాదిన్నర సమయం ట్రావెల్ చేసింది. అన్నీ ఓకే అనుకున్న తర్వాత డేట్స్ ఇచ్చే ముందు ఆమె పెట్టిన షరతులు కారణంగా , ఈ చిత్రం నుండి ఆమెని తప్పించాము. భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేయడమే కాకుండా, స్పిరిట్ చిత్రానికి వచ్చే లాభాల్లో 10 శాతం వాటా కావాలని చెప్పింది. అంతే కాకుండా కాల్ షీట్స్ విషయం , పని గంటల విషయం లో కూడా ఆమె చాలా షరతులు పెట్టింది. అది సందీప్ వంగ కి మాత్రమే కాదు , మూవీ టీం మొత్తానికి నచ్చలేదు. పైగా ఆమె కథకు సంబంధించిన గోప్యమైన విషయాలను మీడియా కి లీక్ చేసింది. ఈ కారణాల చేతనే ఆమెని తప్పించాము’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే రీసెంట్ గానే ఈ చిత్రం నుండి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తప్పుకున్నాడు. ఈమధ్య కాలం లో ప్రకాష్ రాజ్ రాజకీయ పరంగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆయన చేసే వ్యాఖ్యలు తీవ్ర రూపం దాల్చాయి. ఆ కారణం చేత ప్రకాష్ రాజ్ పై నెగెటివిటీ మామూలు రేంజ్ లో లేదు. అయితే సందీప్ వంగ ప్రకాష్ రాజ్ కి ఒక షరతు పెడుతూ , ‘స్పిరిట్’ చిత్రం పూర్తి అయ్యేవరకు రాజకీయ పరమైన కామెంట్స్ కి దూరంగా ఉండండి, మీ కారణం చేత సినిమాపై ఎలాంటి ప్రభావం చూపకూడదు అని అన్నాడట. అందుకు ప్రకాష్ రాజ్ ఒప్పుకోలేదట. రాజకీయాలకు , సినిమాలకు సంబంధం లేదని వాదించి , ఈ సినిమా నుండి తప్పుకున్నాడని సమాచారం.