Deepika Padukone : మన ఇండియా లో హీరోయిన్స్ క్యాటగిరీలో , బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్స్ జాబితా తీస్తే , అందులో కచ్చితంగా దీపికా పదుకొనే పేరు ఉంటుంది. చూపులు తిప్పుకోలేని రేంజ్ అందం, అద్భుతమైన నటన ఈ రెండు ఈమె సొంతం. ముఖ్యంగా ఒక సినిమాకు ఆమె సంతకం చేస్తే , ప్రాణం పెట్టి పని చేస్తుంది. ఇలాంటి డెడికేషన్ చూపిస్తుంది కాబట్టే , ఇప్పటికీ ఈమె ఎంత మంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన చెక్కు చెదరని స్టార్ స్టేటస్ తో ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘రాకా’ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో దీపికా పదుకొనే చేసిన సాహసం గురించి ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద చర్చ సాగుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే , దీపికా పదుకొనే రీసెంట్ గానే రెండవసారి గర్భం దాల్చింది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా ఇలాంటి సమయం లో మెటర్నిటీ లీవ్ తీసుకుంటారు. కానీ దీపికా పదుకొనే అలాంటివేమీ చేయలేదట. గర్భం దాల్చినప్పటికీ ఆమె షూటింగ్ లో పాల్గొనడమే కాకుండా, భారీ యాక్షన్ సన్నివేశం లో కూడా నటించిందట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. గర్భం దాల్చినప్పుడు స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఎలా విశ్రాంతి తీసుకుంటారో మన కళ్లారా నిజ జీవితాల్లో చూస్తూనే ఉంటాం. కానీ దీపికా తన వృత్తి కోసం , పెద్ద రిక్స్ చేస్తోంది. ఇది సాధారణమైన విషయం కాదు , యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్న సమయం లో ఏ చిన్న గాయం తగిలినా గర్భం కోల్పోయే ప్రమాదం ఉంది. దీపికా అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ , మరోపక్క వర్క్ పట్ల ఆమె చూపిస్తున్న డెడికేషన్ కి ఎలాంటి వారైనా సెల్యూట్ చేయాల్సిందే.
ఇక ‘రాకా’ విషయానికి వస్తే , ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో విరామం లేకుండా సాగుతోంది. ఈ ఏడాదిలోపే ఎట్టి పరిస్థితిలో ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలని అల్లు అర్జున్ డెడ్ లైన్ పెట్టడం తో మూవీ టీం అందుకు తగ్గట్టుగా ప్లానింగ్ చేస్తోంది. ఈ చిత్రం లో దీపికా పదుకొనే తో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి వారు కూడా నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే అల్లు అర్జున్ తో పుష్ప సిరీస్ లో రొమాన్స్ చేసిన రష్మిక మందాన , ఈ చిత్రం లో క్రూరమైన విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది . వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
