spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ishan Kishan: ఇషాన్ కిషన్ మీద బీసీసీఐ పెద్దలకు ఎందుకింత కర్కశత్వం?

Ishan Kishan: ఇషాన్ కిషన్ మీద బీసీసీఐ పెద్దలకు ఎందుకింత కర్కశత్వం?

Ishan Kishan: టీ 20 ఫార్మాట్ లో ఇటీవల సంచలనాలు సృష్టించాడు ఇషాన్ కిషన్ . ముఖ్యంగా న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. ఒక సెంచరీ, మరొక హాఫ్ సెంచరీ తో పెను విధ్వంసం సృష్టించాడు. ఇషాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో అతడికి టి20 వరల్డ్ కప్ లో అవకాశం కల్పించారు. ప్రస్తుతం అతడు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ఇషాన్ కిషన్ అంతకంటే ముందు డొమెస్టిక్ క్రికెట్ లో సంచలనం సృష్టించాడు. ఏకంగా జార్ఖండ్ జట్టును విజేతగా నిలిపాడు. సారధిగా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్ మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు..ఆ తరహాలో ఆడినప్పటికీ కూడా అతడికి జట్టులో చోటు అంత ఈజీగా లభించలేదు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ గాయపడిన నేపథ్యంలో అతడి స్థానంలో న్యూజిలాండ్ సిరీస్ కు కిషన్ ను ఎంపిక చేశారు.

న్యూజిలాండ్ సిరీస్ ద్వారా వచ్చిన అవకాశాన్ని కిషన్ వినియోగించుకున్నాడు. మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. పరుగుల వరద పారించాడు. సాధారణంగా టి20 తరఫున అభిషేక్ శర్మ ఊర మాస్ ఇన్నింగ్స్ ఆడుతుంటాడు. కానీ అతడిని మించిపోయాడు కిషన్. విధ్వంసం అంటే ఎలా ఉంటుందో.. పరాక్రమం అంటే ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించాడు. అందువల్లే టి20లలో అతడు కింగ్ మేకర్ అయ్యాడు.

ఆ స్థాయిలో ఆడుతున్న కిషన్ విషయంలో ఇప్పటికి మేనేజ్మెంట్ ఆగ్రహం గానే ఉందా? గతంలో కోపాన్ని ఇంకా తగ్గించుకోలేదా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానాలు లభిస్తున్నాయి. దేశవాళి క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో కిషన్ కు టి20 వరల్డ్ కప్ లో చోటు లభించింది. అయితే అతడికి సెంట్రల్ కాంట్రాక్టు విషయంలో బిసిసిఐ అంత గొప్పగా దయ చూపలేదు. తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో అందరికీ చోటు దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి ఇంకా కొంతకాలం సమయం ఉందని.. అప్పటి వరకు ఎదురు చూడక తప్పదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. గతంలో రంజీలలో ఆడకుండా రెస్ట్ తీసుకోవడం.. డొమెస్టిక్ క్రికెట్ మొత్తాన్ని నిర్లక్ష్యం చేయడంతో 2023 24 సీజన్ సెంట్రల్ కాంట్రాక్టులో కిషన్ తో పాటు అయ్యర్ కూడా చోటు కోల్పోయాడు. తాజా జాబితాలో అయ్యర్ కు గ్రేడ్ బీ లో చోటు లభించింది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

US Iran War

US Iran War: ఇరాన్‌ యుద్ధానికి 95 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌.. అమెరికా కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం!

US Iran War: అమెరికా–ఇరాన్‌ యుద్ధం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవలే కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించాయి. శాంతి ఒప్పంద ప్రకారం ఇరాన్‌ నడుచుకోవడం లేదని అమెరికా...
US Tariffs

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...
Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
Oktelugu Epaper