Homeక్రీడలుక్రికెట్‌IND vs WI: 14 పరుగుల తేడాతో గెలిచాం సరే.. ఈ లోపాల సంగతేంటి అయ్యర్...

IND vs WI: 14 పరుగుల తేడాతో గెలిచాం సరే.. ఈ లోపాల సంగతేంటి అయ్యర్ మాస్టారూ

IND vs WI: ఇండోర్ మ్యాచ్లో భారత్ 14 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా వెస్టిండీస్ జట్టు మీద తన లీడ్ ను రెంటుకు పెంచుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి. భారత్ మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ దక్కినట్టే. కానీ అది అంత ఈజీగా కనిపించడం లేదు. ఇండోర్లో జరిగిన మూడో మ్యాచ్లో భారత ప్లేయర్ల ఆట తీరు పరిశీలిస్తే అనేక రకాల ఆందోళనకరమైన అంశాలు కల్పించాయి. ముఖ్యంగా బ్యాటింగ్ […]

IND vs WI: ఇండోర్ మ్యాచ్లో భారత్ 14 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా వెస్టిండీస్ జట్టు మీద తన లీడ్ ను రెంటుకు పెంచుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ లో ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి. భారత్ మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ దక్కినట్టే. కానీ అది అంత ఈజీగా కనిపించడం లేదు.

ఇండోర్లో జరిగిన మూడో మ్యాచ్లో భారత ప్లేయర్ల ఆట తీరు పరిశీలిస్తే అనేక రకాల ఆందోళనకరమైన అంశాలు కల్పించాయి. ముఖ్యంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కీలక వికెట్లు వరుసగా కోల్పోయింది. భారీగా పరుగులు చేసినప్పటికీ ప్రత్యర్థిని పూర్తిగా నియంత్రించలేకపోయింది. చివరి ఓవర్లలో దారుణంగా పరుగులు ఇచ్చింది.

ఈ మ్యాచ్ ప్రారంభంలోనే సంజు శాంసన్ విఫలమయ్యాడు. అతడి కేవలం మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. శర్మ.. కిషన్ దూకుడుగా ఆటం వల్ల సంజు లోటును టీమిండియా భర్తీ చేయగలిగింది. సంజు వరుసగా మంచి ఇన్నింగ్స్ లు ఆడకపోతే అతడు జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ప్రమాదకరంగా మారవచ్చు.

అభిషేక్ శర్మ 30 బంతుల్లో 69 పరుగులు.. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 37 పరుగులు చేసి.. టీమిండియా కు ఊపు తీసుకొచ్చారు. వీరిద్దరూ కేవలం 40 బంతుల్లోనే 108 పరుగులు జోడించారు. ఒక సందర్భంలో ఇండియా 8.2 ఓవర్లలో 115 రన్స్ చేసింది. టీమిండియా బ్యాటింగ్ జోరుగా సాగుతోంది అనుకుంటే.. మరో లోపం బయటపడింది. కిషన్ అవుట్ అయిన తర్వాత.. అదే ఓవర్లో అయ్యర్ కూడా వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. కేవలం రెండు ఓవర్ల వ్యవధిలో టీమ్ ఇండియా 115/2 నుంచి 124/4 కు పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. మరో బ్యాటర్ నిలబడి ఇన్నింగ్స్ నిర్మించాలి. భారీ స్కోరు సాధించాలంటే దూకుడుతో పాటు వికెట్లను కాపాడుకునే వ్యూహం కూడా ఆటగాళ్లకు అవసరం.

అభిషేక్ శర్మ.. ఇషాన్ కిషన్ ఇచ్చిన ఆరంభాన్ని చూస్తే భారత్ ఏకంగా 250 పరుగుల వరకు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కీలక సమయంలో భారత్ వికెట్లు కోల్పోయింది. తద్వారా మన ఆటగాళ్లు ఒత్తిడి ముందు తట్టుకోలేరని మరోసారి నిజమైపోయింది. ఫలితంగా టీమ్ ఇండియా 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినప్పటికీ.. 223 పరుగులకే ఆల్ అవుట్ కావాల్సి వచ్చింది. ఇది ఉత్తమమైన స్కోర్ అయినప్పటికీ.. మొదటి 8 ఓవర్లలో వచ్చిన పరుగులతో పోల్చి చూస్తే తక్కువే. ముఖ్యంగా తిలక్ వర్మ రన్ అవుట్ కావడం.. చివరి ఓవర్లలో వికెట్లు పడిపోవడం జట్టు స్కోరును తీవ్రంగా ప్రభావితం చేసింది. బ్యాటల మధ్య సమన్వయం కనిపించలేదు. స్ట్రైక్ రొటేషన్ కూడా సరిగా జరగలేదు. చివరి 5 ఓవర్లలో వికెట్ల నిర్వహణ కీలకంగా లేదు.

భారత్ 223 పరుగులు చేసిన తర్వాత వెస్టిండీస్.. ఆ లక్ష్యాన్ని చేదించడానికి గట్టిగానే పోరాడింది. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 209/7 పరుగులు చేసింది. 14 పరుగుల తేడాతో మాత్రమే భారత బౌలర్లు మ్యాచును కాపాడగలిగారు. హోల్కర్ మైదానం బౌలర్లకు అనుకూలంగా ఉండదు. అలాగని పరుగులు ఇచ్చుకుంటూ పోతే మ్యాచును కాపాడుకునే పరిస్థితి ఉండదు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ హోప్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. కమిల్ పూరన్, షిమ్రోన్ హిట్ మేయర్ దూకుడు గా ఆడారు. భారీ షాట్లు ఆడుతున్న బ్యాటర్లకు బంతులను వేగం తగ్గించి వేయడంతో.. వారు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. యార్కర్లు..లైన్ మార్పులు చేపట్టాల్సి ఉండగా.. భారత్ బౌలర్లు ఆ పని చేయలేకపోయారు. వెస్టిండీస్ బ్యాటర్ షమర్ స్ప్రింగర్ కేవలం 11 బంతుల్లోనే అజయంగా 35 పరుగులు చేశాడు. చివరి ఓవర్ లో భారీగా బ్యాటింగ్ చేశాడు.. ఒకవేళ మరొక ఓవర్ మిగిలి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. ఏది ఏమైనా ఈ మ్యాచ్ ఫలితం టీమిండియా బౌలర్లకు ఒక గుణపాఠం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper