Homeక్రీడలుక్రికెట్‌Glenn Maxwell Retirement : గ్లెన్ మాక్స్ వెల్ రిటైర్మెంట్.. అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు.....

Glenn Maxwell Retirement : గ్లెన్ మాక్స్ వెల్ రిటైర్మెంట్.. అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Glenn Maxwell Retirement : క్రికెట్లో కొంతమంది ఆటగాళ్లు పరుగులు చేస్తారు. మరి కొంతమంది మ్యాచులను గెలిపిస్తారు. ఇంకొందరు మాత్రం తమ ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. ఈ మూడో కోపకు చెందిన ఆటగాడే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్. మైదానంలోకి దిగితే బౌలర్లకు నిధులు లేకుండా చేస్తాడు.. అయితే ఇతడు తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 38ల వయసులో తన అంతర్జాతీయ కెరియర్ కు ముగింపు పలకపోతున్నట్టు నవంబర్ […]

Glenn Maxwell Retirement : క్రికెట్లో కొంతమంది ఆటగాళ్లు పరుగులు చేస్తారు. మరి కొంతమంది మ్యాచులను గెలిపిస్తారు. ఇంకొందరు మాత్రం తమ ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. ఈ మూడో కోపకు చెందిన ఆటగాడే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్. మైదానంలోకి దిగితే బౌలర్లకు నిధులు లేకుండా చేస్తాడు.. అయితే ఇతడు తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 38ల వయసులో తన అంతర్జాతీయ కెరియర్ కు ముగింపు పలకపోతున్నట్టు నవంబర్ మూడున్న ప్రకటించాడు.

మాక్స్ వెల్ నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే 2025లో వన్డే క్రికెట్ కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు టి20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. విక్టోరియా జట్టు తరఫున 50 ఓవర్లు.. నాలుగు రోజుల ఫార్మాట్లో కూడా ఆడబోనని అతడు ప్రకటించాడు. అయితే అతడు పూర్తిగా క్రికెట్ కు దూరం కావడం లేదు. ఫ్రాంచైజీ టి20 లీగ్ లలో ఆడతాడు. ముఖ్యంగా బిగ్ బాష్ లీగ్ లలో మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆడతాడు.

విధ్వంసకరమైన ఆట తీరుకు మాక్స్ వెల్ చిరునామా. ఇతడు బ్యాటింగ్ స్టైల్ చాలా భిన్నమైనది. సాధారణ బ్యాటరీలు ఆడేందుకు ఇష్టపడని దిశలో కూడా ఇతడు బంతిని బౌండరీకి పంపించగలరు. రివర్స్ స్వీప్ లు , వినూత్నమైన షాట్లు, భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెడతాడు. అందుకే అతడికి ది బిగ్ షో అనే పేరు వచ్చింది.

ఆశ్చర్య తరఫున 149 వన్డేలు.. 130 t20 అంతర్జాతీయ మ్యాచులు.. 7 టెస్టులు ఆడాడు. వన్డేలలో 3990 పరుగులు చేశాడు. టి20లలో 2897 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టి20 లలో ఐదు సెంచరీలు చేశాడు. ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ సర్వతో కలిసి ప్రత్యేకమైన స్థానంలో నిలిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో 128 వికెట్లు పడగొట్టాడు.

2023 వన్డే ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాక్స్ వెల్ కెరియర్లో చిరస్థాయిగా బ్యాటింగ్ చేశాడు. 292 పరుగుల లక్ష్యంతో రంగంలోకి ఆస్ట్రేలియా ఒక దశలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అతడు ఒంటరి పోరాటం చేశాడు. కండరాల నొప్పితో పరుగులు తీయడానికి కూడా ఇబ్బంది పడుతూ.. 128 బంతుల్లో 201* పరుగులు చేశాడు. ఇందులో 21 ఫోర్లు.. 10 సిక్సర్లు ఉన్నాయి.. కెప్టెన్ కమిన్స్ తో కలిసి 202* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. ఆస్ట్రేలియాకు అసాధ్యం అనుకున్న విజయాన్ని అందించాడు. 2015.. 2023 వన్డే ప్రపంచ కప్ లు.. 2021 t20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో మాక్స్ వెల్ కీలక భాగస్వామిగా ఉన్నాడు.

“శరీరాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం వచ్చేసింది. కెరియర్లో మిగిలిన టోర్నీ ల కోసం శరీర సామర్థ్యం మీద దృష్టి పెట్టాలి. స్వదేశంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ తో వీడ్కోలు పలకాలని చిన్న ఆశ ఉంది. అయితే యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని ఆస్ట్రేలియా జట్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నాను.. అని మాక్స్ వెల్ వెల్లడించాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper