maruti suzuki: కారు కొనాలని ప్రతి మధ్యతరగతి కుటుంబం కలలు కంటుంది. అయితే కారు కొనడం ఒక ఎత్తు అయితే.. దానిని కొనుగోలు చేసిన తర్వాత నిర్వహించడం మరోక ఎత్తు. పెట్రోల్ ధరలు.. సర్వీసింగ్ ఖర్చులు.. విడిభాగాల ధరలు.. ఇలా ఎన్నో అంశాలను ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే చాలామంది కారు కొనుగోలు చేసే సమయంలో కేవలం లుక్స్.. ఫీచర్లకే ప్రాధాన్యం ఇవ్వరు. మంచి మైలేజీ.. తక్కువ నిర్వహణ.. సులభంగా అందుబాటులో ఉండే సర్వీసింగ్ సదుపాయాలను కూడా పరిశీలిస్తారు. ఈ విషయంలో మనదేశంలో ఎక్కువగా వినిపించే పేరు మారుతి సుజుకి.
ఎందుకు దగ్గర అయింది
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. 1983లో మారుతి 800 తో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు హచ్ బ్యాక్ కార్ల నుంచి ఈ ఎస్ యు వి.. ఎంపీ వి.. హైబ్రిడ్ కార్ల వరకు విస్తరించింది. తక్కువ ధరలో కారును అందుబాటులోకి తీసుకురావడం.. ఇంధన సామర్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం. విస్తృత సర్వీస్ నెట్వర్క్ ఏర్పాటు చేయడం వాటి అంశాలు కంపెనీకి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసేవారు.. రోజూ ఆఫీసులకు వెళ్లేవారు.. కుటుంబ అవసరాల కోసం కారు తీసుకునేవారు మారుతి కార్లను పరిశీలిస్తూ ఉంటారు.
మారుతి సుజుకి కార్లకు ఉన్న ప్రధాన ఆకర్షణలో మైలేజ్ ఒకటి. మైలేజీ.. ఆల్టో కే 10, సెలెరియో.. స్విఫ్ట్.. డిజైర్.. వ్యాగన్ఆర్ వంటి మోడల్స్ ఇంధన సామర్థ్యానికి ప్రాధాన్యం ఇచ్చే కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కంపెనీ ఇస్తున్న సిఎన్జి కార్లు కూడా మిడిల్ క్లాస్ కస్టమర్లకు మరో ఆల్టర్నేటివ్ గా మారా. సెలెరియో సిఎన్జి.. డిజైర్ సిఎన్జి.. స్విఫ్ట్ సిఎన్జి వంటి మోడల్స్ పెట్రోల్ తో పోలిస్తే తక్కువ ఇంధన ఖర్చుతో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇదే సమయంలో గ్రాండ్ విటారా.. విక్టోరిస్ వంటి మోడల్స్ లో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ ని అందిస్తోంది. విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కు కంపెనీ ప్రకటించిన ఇంధన సామర్థ్యం లీటర్ కు 28.65 కిలోమీటర్లు. గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ కు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
మారుతి సుజుకి కార్లకు ఉన్న మరో ప్రధాన ప్రయోజనం సర్వీసింగ్ సదుపాయాలు. దేశవ్యాప్తంగా విస్తరించిన సర్వీస్ నెట్వర్క్.. విడిభాగాల లభ్య.. వివిధ బడ్జెట్లకు సరిపోయే మోడల్స్ కస్టమర్లకు అనుకూలంగా ఉంటాయి. కారు కొనుగోలు చేసిన తర్వాత నిర్వహణ కర్చులను కూడా లెక్కించే మిడిల్ దాచుకో కుటుంబాలకు ఈ అంశాలు కీలకంగా మారాయి .
మనదేశంలో కార్ల మార్కెట్లో కస్టమర్ల అభిరుచులు మారిపోతున్నాయి ఒకప్పుడు మైలేజీ.. తక్కువ ధరకు ప్రాధాన్యం ఇచ్చిన కొనుగోలుదారులు ఇప్పుడు సెక్యూరిటీ.. ఆధునిక ఫీచర్లు.. ఎస్ యు వి డిజైన్.. సౌకర్యాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. టాటా మోటార్స్.. మహీంద్రా.. హ్యుందాయ్ వంటి కంపెనీలు కూడా ఈ విభాగంలో గట్టి పోటీ ఇస్తున్నాయి. మారుతి సుజుకి కూడా తన మోడల్స్ కార్లలో సెక్యూరిటీ.. టెక్నాలజీ.. ఇతర ఫీచర్లను మెరుగుపరుస్తోంది. అయినప్పటికీ కారు కొనుగోలు చేసేటప్పుడు క్రాఫ్ట్ టెస్ట్ రేటింగ్స్.. ఎయిర్ బ్యాగ్స్ వంటి ఇతర ఫీచర్లను పరిశీలించాలి.
మారుతి సుజుకి కంపెనీకి భారత మార్కెట్ లో ఉన్న ఆదరణ అమ్మకాల గణాంకాలను పెంచుతుంది. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి మొత్తం 24.2 లక్షల వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయ విక్రయాలు 18.61 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.
కేవలం బ్రాండ్ పేరు చూసి కార్గోనుగోలు చేయడం సరైన నిర్ణయం కాదు. రోజు ఎంత దూరం ప్రయాణిస్తారు.. పెట్రోల్ కావాలా.. సిఎన్జి కావాలా.. కుటుంబంలో ఎంతమంది ఉంటారు.. సెక్యూరిటీకి ఎంత ప్రయారిటీ ఇస్తారు.. బడ్జెట్ ఎంత.. అనే అంశాలను పరిశీలించాలి. మొత్తానికి మంచి మైలేజ్.. విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్.. తక్కువ నిర్వాహన ఖర్చులకు ప్రయారిటీ ఇచ్చే కస్టమర్లకు మారుతి సుజుకి ఇప్పటికీ బలమైన ప్రత్యామ్నాయం. అయితే భద్రత.. ఫీచర్లు.. డ్రైవింగ్ అనుభవం అంటే అంశాల్లో ఇతర కంపెనీల మోడల్స్ తో పోల్చి చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.