Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రోహిత్ కి బంపర్ ఆఫర్..'బిగ్ బాస్ 10' టైటిల్ విన్నర్...

Bigg Boss 10 Telugu: రోహిత్ కి బంపర్ ఆఫర్..’బిగ్ బాస్ 10′ టైటిల్ విన్నర్ కి కూడా ఇలాంటి అదృష్టం రాదేమో!

Bigg Boss 10 Telugu: దేవుడు ఒక చోట తలుపు మూస్తే మరో చోట తెరుస్తాడు అంటుంటారు పెద్దలు. ‘బిగ్ బాస్ 10’ లో రోహిత్ నాయుడు పరిస్థితి చూస్తే అది నిజమే అనిపిస్తోంది. నెంబర్ 1 ఓటింగ్ తో ముందుకు దూసుకెళ్తున్న రోహిత్ ని అత్యంత అన్యాయంగా హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేట్ చేయడం ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. రోహిత్ ఎలిమినేట్ అయ్యాక ఆ షోని ప్రేక్షకులు మెజారిటీ శాతం చూడడం ఆపేసారు. ఫలితంగా […]

Bigg Boss 10 Telugu: దేవుడు ఒక చోట తలుపు మూస్తే మరో చోట తెరుస్తాడు అంటుంటారు పెద్దలు. ‘బిగ్ బాస్ 10’ లో రోహిత్ నాయుడు పరిస్థితి చూస్తే అది నిజమే అనిపిస్తోంది. నెంబర్ 1 ఓటింగ్ తో ముందుకు దూసుకెళ్తున్న రోహిత్ ని అత్యంత అన్యాయంగా హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేట్ చేయడం ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. రోహిత్ ఎలిమినేట్ అయ్యాక ఆ షోని ప్రేక్షకులు మెజారిటీ శాతం చూడడం ఆపేసారు. ఫలితంగా భారీ స్థాయిలో రేటింగ్స్ కూడా పడిపోయాయి అట. కచ్చితంగా రోహిత్ రీ ఎంట్రీ ఉంటుందని అభిమానులు చాలా ఆశతో ఎదురు చూశారు కానీ, అది జరగలేదు. అయితే ‘బిగ్ బాస్’ టైటిల్ గెలిచినంత మాత్రానా సినిమాల్లో, బుల్లితెర సీరియల్స్ లో వరుసగా అవకాశాలను సంపాదిస్తూ ఫేమస్ అయిపోవచ్చు అనుకుంటే పెద్ద పొరపాటే.

ఎందుకంటే టైటిల్ విన్నెర్స్ గా నిలిచినా ఎంతో మంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఏమి చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు రోహిత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాకపోవచ్చు, కానీ ఆయన కోసం ఒకపక్క బుల్లితెర నుండి, మరోపక్క వెండితెర నుండి అవకాశాలు క్యూలు కడుతున్నాయి. రీసెంట్ గానే టాలీవుడ్ బడా నిర్మాత ఒకరు రోహిత్ ని హీరో గా పెట్టి ఒక సినిమా తీయడానికి అమితాసక్తి చూపించాడట. అందుకు సంబంధించిన అడ్వాన్స్ కూడా ఇచ్చారట. ఎవరు ఆ నిర్మాత?, డైరెక్టర్ ఎవరు వంటి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. అంతే కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా రోహిత్ తో వెబ్ సిరీస్ లు చేయడానికి అమితాసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. వీటితో పాటు సీరియల్స్ లో కూడా అవకాశాలు వస్తున్నాయట. రోహిత్ సరైన దారి ఎంచుకోవాలే కానీ, ఆయన ఎవ్వరూ చూడనంత పీక్ రేంజ్ ని చూడొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.

అయితే అభిమానులు మాత్రం సినీ ఇండస్ట్రీ కంటే టీవీ ఇండస్ట్రీ బెటర్ అని రోహిత్ కి సోషల్ మీడియా ద్వారా సలహాలు అందిస్తున్నారు. ఎందుకంటే బుల్లితెర మీద మెగాస్టార్ రేంజ్ కి ఎదిగిన ఎంతో మంది సెలబ్రిటీలు, సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ అవుదామని వెళ్లి చతికిల పడ్డారని, ఇప్పుడు వాళ్లకు అటు సినిమాలు లేక , ఇటు సీరియల్స్, టీవీ షోస్ లేక కెరీర్ పరంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటున్నారని, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని, టీవీ ఇండస్ట్రీ లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని కాదు అనకుండా ఉపయోయించుకుంటే కెరీర్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. మరి రోహిత్ సినీ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతాడా? లేదా టీవీ ఇండస్ట్రీ పై మొగ్గు చూపుతాడా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper