Homeటాప్ స్టోరీస్Rhenium Powder Scam: రాగి కాదు.. ఈ పౌడర్ కలిపి కల్తీ.. బంగారం కొనేవాళ్ళు జాగ్రత్త...

Rhenium Powder Scam: రాగి కాదు.. ఈ పౌడర్ కలిపి కల్తీ.. బంగారం కొనేవాళ్ళు జాగ్రత్త సుమా..

Rhenium Powder Scam: బంగారం ధర తగ్గింది. ఇంకా తగ్గుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇప్పుడు వివాహ వేడుకల సమయం కావడంతో చాలామంది భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. గతంతో పోల్చి చూస్తే బంగారం ధర తగ్గిన నేపథ్యంలో చాలామంది పసిడిని కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా డిమాండ్ ఎక్కువ అయినప్పుడు ఒక వస్తువులో కల్తీ లేదా.. దాని నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది. పైగా బంగారం అనేది […]

Rhenium Powder Scam: బంగారం ధర తగ్గింది. ఇంకా తగ్గుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఇప్పుడు వివాహ వేడుకల సమయం కావడంతో చాలామంది భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. గతంతో పోల్చి చూస్తే బంగారం ధర తగ్గిన నేపథ్యంలో చాలామంది పసిడిని కొనుగోలు చేస్తున్నారు.

సాధారణంగా డిమాండ్ ఎక్కువ అయినప్పుడు ఒక వస్తువులో కల్తీ లేదా.. దాని నాణ్యత తగ్గిపోతూ ఉంటుంది. పైగా బంగారం అనేది అత్యంత విలువైన లోహం. ఇందులో అక్రమాలకు.. కల్తీ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. బంగారంలో కల్తీని నివారించడానికి ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్రమార్కులు ఏదో ఒక రూపంలో పసిడిని కల్తీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు బంగారం ధర తగ్గిన నేపథ్యంలో పసిడిని కల్తీ చేసి అమ్ముతున్న అక్రమార్కులు తెరమీదకి వచ్చారు..

బంగారంలో ఇత్తడి కలిపి గతంలో కల్తీ చేసేవారు. కొన్ని సందర్భాలలో వెంటనే కూడా కలిపి బంగారం నాణ్యతను ప్రశ్నార్థకం చేసేవారు. అయితే ఇప్పుడు కొత్త రకం మోసం తెరపైకి వచ్చింది. సాధారణంగా బంగారంలో రాగి.. వెండి వాటి లోహాలను కలిపి స్వచ్ఛతను తగ్గించడం గురించి మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు రేనీయం (Rhenium) అనే అరుదైన లోహాన్ని ఉపయోగించి బంగారు ఆభరణాల కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు.. అధిక సాంద్రత కలిగి ఉండే ఈ లోహాన్ని ఉపయోగించి ఆభరణాల బరువును పెంచి.. బయటికి బంగారం రాగానే కనిపించే విధంగా చేస్తున్నారు.

రేనియం అనేది అత్యంత అధిక సాంద్రత కలిగిన అరుదైన లోహం. దీని సాంద్రత ఒక క్యూబిక్ సెంటీమీటర్ కు సుమారు 21.02 గ్రాములు. అదే స్వచ్ఛమైన బంగారం సాంద్రత సుమారు 19.3 గ్రాములు. ఈ రెండు లోహాల సాంద్రత దగ్గరగా ఉండడంతో రేనియం ను ఉపయోగించి బంగారు ఆభరణాల పరులను కృత్రిమంగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రేనియం పొడిని ఆభరణాల లోపలి భాగంలో లేదా ఇతర లోహాలతో కలిపి ఉపయోగిస్తే బయటకు చూసినప్పుడు సాధారణ బంగారు ఆభరణాల లాగానే కనిపించే అవకాశం ఉంటుంది. రేనియం ద్రవిభవన స్థానం కూడా చాలా ఎక్కువ. సుమారు 3,186 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే అది కరుగుతుంది. దీంతో బంగారం కరిగించే సాధారణ ప్రక్రియలో రేనియం పూర్తిగా కరగకుండా మిగిలే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. కొన్ని ప్రాథమిక XRF పరీక్షలు ఆభరణం ఉపరితలంలోని మూలకాలను మాత్రమే విశ్లేషిస్తాయి. అందువల్ల లోపలి భాగంలో కల్తీ ఉంటే పరీక్షలు పూర్తిగా బయటపడకపోవచ్చు.

ఈ తరహా మోసంలో కస్టమర్లకు ఎదురయ్యే ప్రధాన నష్టం స్వచ్ఛతకు సంబంధించినది. 22 క్యారెట్ల బంగారం పేరుతో తక్కువ స్వచ్ఛత కలిగిన ఆభరణాన్ని విక్రయిస్తే కొనుగోలుదారుడు భారీగా నష్టపోవచ్చు. బంగారం ధరలు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రతి 10 గ్రాముల కొనుగోలుపై వేల రూపాయల నష్టం కలిగే అవకాశం ఉంటుంది. బంగారం కొనుగోలు చేస్తున్నప్పుడు చాలావరకు జాగ్రత్తలు పాటించాలి.

బంగారం కొనేవాళ్లు ఇవి కచ్చితంగా పరిశీలించాల్సిందే

  • బీఐఎస్ హాల్ మార్క్ పరిశీలించాలి. ఆభరణ పై ఉన్న ఆరు అంకెల హెచ్ యూఐడీ నంబర్ ను బీఐఎస్ కేర్ యాప్ లో నమోదు చేసి వివరాలు పరిశీలించవచ్చు.
  • ఆభరణం నికర బరువు.. క్యారెట్లు.. హెచ్ యూ ఐ డీ నెంబర్.. తయారీ చార్జీలు.. ఇతర వివరాలు బిల్లులో స్పష్టంగా ఉండాలి.
  • భారీ డిస్కౌంట్లు.. నమ్మశక్యం కాని ధరలు.. ప్రత్యేక ఆఫర్ల పేరుతో చేసే విక్రయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
  • కొనుగోలు చేసే ముందు తిరిగి విక్రయించడం.. మార్పిడి చేయడం వంటి నిబంధనలు తెలుసుకోవాలి.
  • ఆభరణం స్వచ్ఛతపై సందేహం ఉంటే బీఐఎస్ గుర్తింపు పొందిన అసైయింగ్ అండ్ హాల్ మార్క్ సెంటర్ ను కచ్చితంగా పరిశీలించాలి.

బంగారం స్వచ్ఛతను నిర్ధారించడానికి షైర్ ఆస్పే పరీక్షను ప్రామాణిక పద్ధతిగా పరిగణిస్తారు. ఇది ఆభరణం నుంచి తీసుకున్న నమూనాను ప్రయోగశాలలో విశ్లేషించే పరీక్షలు. అయితే ఇది నమూనాలోని బంగారం శాతాన్ని నిర్ధారించడంలో ఉపయోగపడుతుంది. రేనియం వంటి ఇతర లోహాల ఊరికినే గుర్తించాల్సిన సందర్భంలో ప్రత్యేక మూలక విశ్లేషణ కూడా అవసరం. ఈ పరీక్షలో నమూనా తీసుకోవాల్సి రావడంతో ఆభరణానికి కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

బంగారం కొనుగోలు అన్నది సామాన్య కుటుంబాలకు పెద్ద పెట్టుబడితో సమానం. అందుకే కేవలం ఆభరణం మెరుపును.. బరువులు చూసి కొనుగోలు చేయకుండా.. హాల్ మార్క్ బిల్లు.. ప్యూరిటీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. అనుమానం వచ్చినప్పుడు స్వతంత్రంగా నిపుణుల ద్వారా పరీక్ష చేయించుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper