Madhuri Rathod: కొంతమంది సెలబ్రిటీలు ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్నప్పటికీ, సరైన సక్సెస్, గుర్తింపు రాదు. అలాంటి సమయం లో వాళ్ళ విషయంలో ఎదో ఒక వివాదం జరిగినప్పుడు మాత్రం ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అలాంటి సెలబ్రిటీస్ లో ఒకరు మాధురి రాథోడ్. ఈమె ఈశ్వర్ సాయి తో కలిసి ఒకే రూమ్ లో ఉన్నప్పుడు, అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ వీడియో సోషల్ మీడియా లో ఒక వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. ఎక్కడ చూసినా దాని గురించే చర్చ నడిచింది. ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఈ అంశం పై నెటిజెన్స్ ప్రత్యేకంగా రీల్స్ కూడా చేశారు. అంతే కాకుండా ఈ ఘటన కి సంబంధించిన సంబాషలను ఒక పాటగా చేసి డీజే మిక్సింగ్ కూడా చేశారు.
అంతలా వైరల్ అయ్యాక , ఇక ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, ఇద్దరి జీవితాలు సర్వనాశనం అయిపోయాయి, ఇక వీళ్లకు ఇండస్ట్రీ లో అవకాశాలు రావడం చాలా కష్టమేనని చాలా మంది అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. ఈశ్వర్ సాయి కెరీర్ సంగతి ఏంటో తెలియదు కానీ, మాధురి రాథోడ్ కెరీర్ మాత్రం పీక్ రేంజ్ కి వెళ్లిపోయిందని చెప్పొచ్చు. ఏ రేంజ్ పీక్ అంటే, ఫోక్ ఇండస్ట్రీ లో ఆమెకు ప్రస్తుతం పోటీ ఇచ్చేవాళ్లే లేరు అన్నమాట. ఆ రేంజ్ కి వెళ్ళిపోయింది. వాస్తవానికి ఈశ్వర్ సాయి విషయం లో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు గమనించి మాధురి ని రక్షించారు. అప్పటి నుండి ధైర్యం తెచ్చుకొని గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. వారానికి ఒక ఫోక్ సాంగ్ ని విడుదల చేస్తూ సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది.
రీ ఎంట్రీ తర్వాత ఆమె చేసిన ‘బిందెలు బిందెలు బావయ్య’, ‘భామ సుందరాలో’ వంటి పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఒక పాటకు 12 మిలియన్ వ్యూస్ రాగా, మరో పాటకు 23 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.ఇంకా ఆమె చేసిన అనేక పాటలకు సంబంధించిన ప్రోమోలు విడుదల అయ్యాయి.వాటికి కూడా అద్భుతమైన వ్యూస్ వచ్చాయి.ఇలా కెరీర్ లో ఫుల్ బిజీ గా ఉంటూ, నెలకు 20 నుండి 30 లక్షల రూపాయిలు సంపాదిస్తుంది అట మాధురి రాథోడ్. ఈ స్థాయిలో ఒక ఫోక్ సింగర్ సంపాదించడం ఈమధ్య కాలం ఎక్కడా చూడలేదని, మాధురి లెవెల్ కి వేరే రేంజ్ కి వెళ్లిపోయిందని అంటున్నారు. ఇక ఆమె భవిష్యత్తులో బిగ్ బాస్ వంటి రియాలిటీ షోస్ కి వెళ్లాల్సిన అవసరం లేదని, త్వరలోనే సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు వస్తాయని అంటున్నారు. మరి ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.