IND vs AFG: క్రికెట్ లో మరీ ముఖ్యంగా టి20 ఫార్మాట్లో ప్లేయర్లు దూకుడుగా ఆడితేనే ఫలితం వస్తుందని అనుకుంటారు. వెంట వెంటనే వికెట్లు పడగొడితే విక్టరీ సాధించవచ్చు అని అనుకుంటారు. ఇవన్నీ చేస్తే విజయం వస్తుంది కరెక్టే. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు కూడా జట్టు కొంప ముంచుతాయి. ఆదివారం భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక చిన్న తప్పిదం ఆఫ్ఘనిస్తాన్ జట్టు కొంప ముంచింది.
తాము చేసిన తప్పిదమే ఓటమికి కారణమైందని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్ ఒప్పుకున్నాడు కూడా. ముఖ్యంగా తాను రన్ అవుట్ కావడం వల్ల జట్టు మూల్యాన్ని చెల్లించుకుందని వివరించాడు. టీమిండియాతో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఆఫ్గనిస్తాన్ ఓడిపోయింది.
ఈ మ్యాచ్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టు ప్లేయర్లు బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ.. తాను రన్ అవుట్ కావడం జట్టు కంభం వచ్చిందని అతడు వాపోయాడు. ఈ మైదానం మీద భారీగా పరుగులు చేసి ఉంటే బాగుండేదని.. కానీ ఆ స్థాయిలో పరుగులు చేయకపోవడం వల్ల ఫలితం మేము అంచనా వేసిన స్థాయిలో రాలేదని అతడు ఒప్పుకున్నాడు. ఆటగాళ్లు మూడు ఆరంభాలను అందించినప్పటికీ. మిగతావారు దాన్ని అందిపుచ్చుకోలేకపోయారని అతడు వాపోయాడు. వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల భారత్ తమ మీద ఒత్తిడి తీసుకొచ్చిందని క్లారిటీ ఇచ్చాడు అందువల్లే ఓడిపోవాల్సి వచ్చిందని అతడు వివరించాడు. మధ్య ఓవర్లలో ఆకట్టుకున్నప్పటికీ.. టీమ్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయామని అతడు అంగీకరించాడు. భారత బౌలర్లు.. ఫీల్డర్లు అదరగొట్టారని.. తాను రన్ అవుట్ కావడమే మ్యాచ్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ అని అతడు వివరించాడు. ఇషాన్ కిషన్ అద్భుతంగా విసరడం.. దానిని మరో ఫీల్డర్ అందుకోవడం.. వికెట్లను పడగొట్టడం వెంట వెంటనే జరిగిపోయాయని.. అదే మ్యాచ్ స్వరూప మొత్తం మార్చేసిందని అతడు వివరించాడు.
ఇక ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినప్పటికీ ఎన్ని వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా 64* పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మహమ్మద్ నబీ 33 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్.. మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.