Homeక్రీడలుక్రికెట్‌PBKS Vs Delhi: 264 కాదు.. 300 టార్గెట్ విధించినా అయ్యర్ ఉండగా పంజాబ్ ను...

PBKS Vs Delhi: 264 కాదు.. 300 టార్గెట్ విధించినా అయ్యర్ ఉండగా పంజాబ్ ను ఓడించడం కష్టం..

PBKS Vs Delhi: ఈసారి శ్రేయస్ అయ్యర్ గట్టిగా అనుకోని ఉంటాడు. గత సీజన్లో పంజాబ్ జట్టుకు ట్రోఫీ మిస్సైంది. కానీ ఈసారి మాత్రం అలా జరగకూడదని.. పంజాబ్ జట్టుకు ఓటమి ఎదురుకాకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అయ్యర్. అందువల్లే అతడు ఈసారి ఐపీఎల్లో తన విధ్వంసాన్ని ప్రత్యర్థి జట్లకు చూపిస్తున్నాడు. ఊర మాస్ బ్యాటింగ్.. అంతకు మించిన కెప్టెన్సీ తో పంజాబ్ జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు.. తాజాగా శనివారం ఢిల్లీ జట్టు పంజాబ్ జట్టు ఎదుట 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ టార్గెట్ ను పంజాబ్ జట్టు కేవలం 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది.

పంజాబ్ జట్టులో ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య(43), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (76), శ్రేయస్ అయ్యర్ (71*) పరుగులు చేసి.. పంజాబ్ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఇంతవరకు ఒక్క ఓటమి కూడా ఎదుర్కోలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి మొదలు పెడితే పంజాబ్ వరకు అన్ని జట్ల మీద విజయాలు సాధించింది. ప్రస్తుతం పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ జట్టు ఈ జోరు కనుక వచ్చే మ్యాచ్లలో చూపిస్తే.. కచ్చితంగా ట్రోఫీ ఆ జట్టుకు లభిస్తుంది.

265 టార్గెట్ విధించినప్పటికీ కూడా పంజాబ్ బ్యాటర్లు ఏమాత్రం భయపడటం లేదు. తమ జట్టులో ఉన్న పంజా దెబ్బను ప్రత్యర్థి జట్లకు రుచి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. కూపర్, అయ్యర్, శశాంక్ సింగ్ మిగతా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందువల్లే పంజాబ్ జట్టు ఈ స్థాయిలో విజయాలు సాధిస్తోంది. ప్రస్తుతం మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన అయ్యర్ ఐపీఎల్ కెరియర్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

అయ్యర్ జోరు చూస్తుంటే.. పంజాబ్ జట్టుకు ఓటమనేది ఉండదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయ్యర్ ఎత్తుల ముందు మిగతా జట్ల సారథులు తేలిపోతున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ కూర్పులో వైవిధ్యాన్ని చూపిస్తున్నాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular