Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli celebration : కోహ్లీ ఎగిరి గంతేశాడు.. అంబానీ ముందు చిందేశాడు..

Virat Kohli celebration : కోహ్లీ ఎగిరి గంతేశాడు.. అంబానీ ముందు చిందేశాడు..

Virat Kohli celebration : ఉత్కంఠ తారస్థాయి చేరింది. ప్రతి పరుగు అత్యంత విలువైనదిగా మారిపోయింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీలో చివరికి బెంగళూరు విజయం సాధించింది. ముంబై జట్టును ఇంటికి పంపించింది. తద్వారా ప్లే ఆఫ్ ఆశలను బెంగళూరు సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో గెలిచిన బెంగళూరు.. సరికొత్త చరిత్ర సృష్టించింది.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగిసింది. 167 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన బెంగళూరు మొదట్లో […]

Virat Kohli celebration : ఉత్కంఠ తారస్థాయి చేరింది. ప్రతి పరుగు అత్యంత విలువైనదిగా మారిపోయింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీలో చివరికి బెంగళూరు విజయం సాధించింది. ముంబై జట్టును ఇంటికి పంపించింది. తద్వారా ప్లే ఆఫ్ ఆశలను బెంగళూరు సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో గెలిచిన బెంగళూరు.. సరికొత్త చరిత్ర సృష్టించింది.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగిసింది.

167 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన బెంగళూరు మొదట్లో తడబడింది. విరాట్ కోహ్లీ 0 పరుగులకు అవుట్ అయ్యాడు. కీలక ప్లేయర్లు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఈ దశలో బెంగళూరు జట్టుకు కృనాల్ పాండ్యా (73) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. బెతల్ (27) మెరుగైన ప్రదర్శన చేశాడు. చివర్లో జితేష్ శర్మ (18) విలువైన పరుగులు చేశాడు.

క్రికెట్ మ్యాచ్ లలో ఓటమి సహజం. గెలుపు కూడా అంతే సహజం.. ఓడిపోయినప్పుడు ఆటగాళ్లు నిరాశలో ఉంటారు. గెలిచినప్పుడు ఆనందంలో ఉంటారు. కానీ కొంతమంది ప్లేయర్లు గెలిచినప్పుడు తమ ఆగ్రహాన్ని దాచుకోరు. గెలిచినప్పుడు ఉత్తమ ఉత్సాహాన్ని ఆపుకోలేరు. ఇటువంటి ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. ప్రస్తుతం అతడి వయసు 37 సంవత్సరాలు. అయినప్పటికీ పాతికేళ్ల కుర్రాడి మాదిరిగానే ఉంటాడు. ఆవేశాన్ని అస్సలు ఆపుకోలేడు. ఆగ్రహాన్ని అస్సలు చల్లార్చుకోలేడు.

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఉత్కంఠ మధ్య విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అమాంతం ఎగిరి గంతులు వేశాడు. అంతేకాదు ముంబై ఇండియన్స్ యజమాని అనంత్ అంబానీ ముందు చిందులు వేశాడు. దీంతో అనంత్ అంబానీ చిన్నబోయాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు ఆటగాడు రసిక్ సలాం చివరి బంతికి రెండు పరుగులు తీసి ముంబై విజయాన్ని ఖరారు చేశాడు. విరాట్ కోహ్లీ ఎగిరి గంతులు వేస్తున్న నేపథ్యంలో ముంబై ఆటగాడు రికెల్టన్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. బంతిని నేలకేసి కొట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. సూర్య కుమార్ యాదవ్ రుచిపచిలేని చూయింగ్ గమ్ తినుకుంటూ.. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేశాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper