Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ కి కోపం వస్తే ఇలా ఉంటుందా.. ప్రఫుల్ కు...

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ కి కోపం వస్తే ఇలా ఉంటుందా.. ప్రఫుల్ కు నైట్ మేర్ ను చూపించాడు

Vaibhav Suryavanshi: కొద్దిరోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ గడ్డమీద.. హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ ఆడుతోంది. ఎన్నో అంచనాలతో వైభవ్ సూర్య వంశీ మైదానంలోకి అడుగు పెట్టాడు. అంతకుముందే అతడు సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టుమీద కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడని.. రాజస్థాన్ ప్లేయర్లు.. రాజస్థాన్ అభిమానులు బలమైన అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇక్కడే రాజస్థాన్ అభిమానులను.. ప్లేయర్లను నిరాశలో ముంచాడు హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్. తొలి ఓవర్ […]

Vaibhav Suryavanshi: కొద్దిరోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ హైదరాబాద్ గడ్డమీద.. హైదరాబాద్ జట్టుతో మ్యాచ్ ఆడుతోంది. ఎన్నో అంచనాలతో వైభవ్ సూర్య వంశీ మైదానంలోకి అడుగు పెట్టాడు. అంతకుముందే అతడు సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టుమీద కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడని.. రాజస్థాన్ ప్లేయర్లు.. రాజస్థాన్ అభిమానులు బలమైన అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇక్కడే రాజస్థాన్ అభిమానులను.. ప్లేయర్లను నిరాశలో ముంచాడు హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్. తొలి ఓవర్ లోనే సూర్య వంశీ ని సున్నా పరుగులకు వెనక్కి పంపించాడు.

సూర్య వంశీ అలా అవుట్ కావడంతో.. రాజస్థాన్ గొప్ప స్కోరు చేయలేకపోయింది. చేజింగ్లో వెనకబడింది. తద్వారా హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. సూర్య వంశీ ఆ వైఫల్యం నుంచి కోలుకోలేదు. మరో మ్యాచ్లో కూడా విఫలమయ్యాడు. దీంతో సునీల్ గవాస్కర్ చెప్పినట్టుగానే అతడి బ్యాటింగ్ పాలపొంగు అని.. అతడు ఇకపై గొప్పగా బ్యాటింగ్ చేయలేడని అందరూ ఒక అంచనాకు వచ్చారు. కానీ వైభవ్ తన ఆట అలాంటిది కాదని.. తాను బ్యాట్ పట్టుకుంటే శివతాండవం చేయాల్సిందేనని నిరూపించాడు.

శనివారం హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ సూర్య వంశీ చెలరేగిపోయాడు. ఏ హైదరాబాద్ గడ్డమీదైతే తనను అవుట్ చేశాడు.. ఆ ప్రఫుల్ బౌలింగ్ లోనే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించాడు. తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో హైదరాబాద్ బౌలర్ కు వాస్తవంలో చూపించాడు.

ప్రఫుల్ ఎన్ని రకాలుగా బంతులు వేసినప్పటికీ.. వైభవ్ మాత్రం వాటిని సిక్సర్లుగానే మలిచాడు. దీంతో రాజస్థాన్ జట్టు తొలి ఓవర్ లోనే 25 పరుగులు చేసింది. ఇందులో వైభవ్ ఐదు బంతులు ఎదుర్కొని.. 25 పరుగులు చేశాడు.. ప్రఫుల్ షార్ట్ పిచ్ బంతులు వేసినప్పటికీ వైభవ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ప్రతిబంతిని స్టాండ్స్ లోకి పంపించాడు. తనకు బౌలింగ్ వేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. అందువల్లే రాజస్థాన్ జట్టు దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

“అతడికి కోపం వస్తుంది. కాకపోతే అది మరొక స్థాయిలో ఉంటుంది. అతడు తన భావోద్వేగాలను నియంత్రించుకోలేడు. చిన్న పిల్లాడు కదా అలానే ఉంటాడు. అతడు మామూలుగానే గట్టిగా కొడతాడు. కానీ హైదరాబాద్ బౌలర్ ప్రఫుల్ మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు. దానికి కారణం లేకపోలేదు. అందువల్లే అతడు 4 బంతుల్లో నాలుగు సిక్సర్లు కొట్టి.. సొంత మైదానంలో విశ్వరూపం చూపించాడు. ఇకపై ప్రఫుల్ అతడికి బౌలింగ్ వేయాలంటే కచ్చితంగా భయపడతాడని” వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. దీనిని బట్టి వైభవ్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper