Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli Anger: విరాట్ కోహ్లీకి ఏమైంది..గిల్ మీద అంత పట్టరాని కోపం ఎందుకు

Virat Kohli Anger: విరాట్ కోహ్లీకి ఏమైంది..గిల్ మీద అంత పట్టరాని కోపం ఎందుకు

Virat Kohli Anger: కింగ్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఆవేశంగా ఉంటాడు. తనను గెలికితే 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు. అందువల్లే విరాట్ కోహ్లీ జోలికి ఏ ఆటగాడు కూడా వెళ్లడు. చివరికి అతడిని గెలకాలని ఏ ఆటగాడు కూడా అనుకోడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ మౌనంగా భరించే రకం కాదు.. మండే భాస్వరం లాగా రెచ్చిపోయే రకం. అందువల్ల విరాట్ కోహ్లీని మిస్సైల్ అని పిలుస్తుంటారు విరాట్ కోహ్లీ జాతీయ […]

Virat Kohli Anger: కింగ్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో ఆవేశంగా ఉంటాడు. తనను గెలికితే 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు. అందువల్లే విరాట్ కోహ్లీ జోలికి ఏ ఆటగాడు కూడా వెళ్లడు. చివరికి అతడిని గెలకాలని ఏ ఆటగాడు కూడా అనుకోడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ మౌనంగా భరించే రకం కాదు.. మండే భాస్వరం లాగా రెచ్చిపోయే రకం. అందువల్ల విరాట్ కోహ్లీని మిస్సైల్ అని పిలుస్తుంటారు

విరాట్ కోహ్లీ జాతీయ జట్టు కోసం ఆడుతున్నప్పుడు.. ఐపీఎల్ బెంగళూరు కోసం మారుతున్నప్పుడు.. డొమెస్టిక్ క్రికెట్లో సొంత జట్టు కోసం ఆడుతున్నప్పుడు.. ఇలా ఎక్కడ ఆడినా సరే విరాట్ కోహ్లీ తన తీరు మార్చుకోడు. అదే కోపంతో ఉంటాడు. తనతో స్నేహం చేస్తే స్నేహంగా ఉంటాడు. ప్రేమిస్తే ప్రేమను ప్రదర్శిస్తాడు. కోపం వ్యక్తం ఇస్తే మాత్రం అందుకు కోటిరెట్లు కోపాన్ని చూపిస్తాడు. ఆవేశాన్ని ఆపుకోడు. ఆగ్రహాన్ని చల్లార్చుకోడు. తన అగ్రెసివ్ నెస్ ను వెనక్కి తీసుకోవాలని అనుకోడు.

విరాట్ కోహ్లీ ఐపీఎల్లో కోపంగా ఉండడం కొత్తేమీ కాదు. గత ఏడాది బెంగళూరు మైదానం వేదికగా ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత కాంతారా లెవెల్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. అది విరాట్ కోహ్లీకి మండింది. దీంతో తదుపరి మ్యాచ్లో కోహ్లీ కేఎల్ రాహుల్ ను టార్గెట్ చేశాడు. అంతేకాదు అతడికి కాంతారా లెవెల్ కి మించిన రివెంజ్ ట్రీట్ ఇచ్చాడు. దీంతో కేఎల్ రాహుల్ సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో చేయి కలిపి.. నవ్వుతూ మాట్లాడాడు.

ఇక తాజాగా గురువారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ బెంగళూరు మీద విజయం సాధించింది. ముఖ్యంగా గుజరాత్ విజయానికి కెప్టెన్ గిల్ దోహదం చేశాడు. అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ గెలుపు బాటలో ఉన్నప్పుడు.. గిల్ భారీ షార్ట్ కొట్టాడు.. అయితే ఆ బంతిని విరాట్ కోహ్లీ అందుకున్నాడు. ఆ తర్వాత బంతిని మైదానానికి నేలకేసి కొట్టాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. గిల్ తో విరాట్ కోహ్లీకి గొడవ ఎక్కడ అయిందని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే వారిద్దరికీ ఎప్పుడు కూడా గొడవ జరగలేదు. కాకపోతే బెంగళూరు జట్టు ఓటమిని తట్టుకోలేక.. గిల్ ఆడుతున్న తీరును చూడలేక.. అతడు ఇచ్చిన క్యాచ్ పట్టుకున్న తర్వాత విరాట్ అలా స్పందించాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్, విరాట్ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper