Homeక్రీడలుక్రికెట్‌South Africa vs Australia : ఆస్ట్రేలియాను మళ్లీ చితక్కొట్టిన సౌతాఫ్రికా.. బవూమా, మిల్లర్ సెంచరీల...

South Africa vs Australia : ఆస్ట్రేలియాను మళ్లీ చితక్కొట్టిన సౌతాఫ్రికా.. బవూమా, మిల్లర్ సెంచరీల మోత.. భారీ స్కోరు

South Africa vs Australia : జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కెప్టెన్ టెంబా బవూమా, స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ అద్భుత శతకాలతో అదరగొట్టడంతో ప్రొటీస్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. తొలి వన్డేలో 67 పరుగులతో గెలిచిన సౌతాఫ్రికా.. రెండో మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.కెప్టెన్ బావుమా, డేవిడ్ మిల్లర్ సెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా ఏకంగా 365/9 ల భారీ స్కోరు […]

South Africa vs Australia : జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కెప్టెన్ టెంబా బవూమా, స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ అద్భుత శతకాలతో అదరగొట్టడంతో ప్రొటీస్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. తొలి వన్డేలో 67 పరుగులతో గెలిచిన సౌతాఫ్రికా.. రెండో మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియాపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.కెప్టెన్ బావుమా, డేవిడ్ మిల్లర్ సెంచరీలతో నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా ఏకంగా 365/9 ల భారీ స్కోరు నమోదు చేసింది. 

తొలి దెబ్బలు.. ఆ తర్వాత జోరు

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. జోష్ హేజిల్‌వుడ్ తొలి ఓవర్‌లోనే ఎయిడెన్ మార్క్రమ్‌ను క్యాచ్ ఔట్ చేయడంతో సౌతాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. అయితే బవూమా, మాథ్యూ బ్రీట్జ్కే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బ్రీట్జ్కే 34 పరుగుల వద్ద ఔటైన తర్వాత డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చాడు.

అక్కడి నుంచి మ్యాచ్ పూర్తిగా సౌతాఫ్రికా వైపు మళ్లింది. బవూమా, మిల్లర్ కలిసి నాలుగో వికెట్‌కు 150కిపైగా పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బవూమా 103 పరుగులతో శతకం పూర్తి చేసి ఔటవ్వగా.. మిల్లర్ మరింత దూకుడుగా కేవలం 93 బంతుల్లో 142 పరుగులు కొట్టి ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో భారీ స్కోరు 265/9 కు బాటలు వేశాడు.

మిల్లర్‌కు అదిరిపోయే సెంచరీ

మొదటి వన్డేలో 25 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు చేసిన మిల్లర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా భిన్నమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడుతూ బౌండరీలు, సిక్సర్లతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. తాజా మ్యాచ్ అప్‌డేట్‌లో మిల్లర్ 93 బంతుల్లో 142 పరుగులతో దంచి కొట్టాడు. ఆస్ట్రేలియన్లను ఓ ఆట ఆడుకున్నాడు.

ఆస్ట్రేలియాపై మిల్లర్‌కు ఇప్పటికే అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టుపై వన్డేల్లో అతని సగటు 57కు పైగా ఉండగా, మూడు సెంచరీలు ఉన్నాయి. 2018లో హోబర్ట్‌లో చేసిన 139 పరుగులు అతని అత్యధిక స్కోరు. తాజా శతకంతో ఆస్ట్రేలియాపై అతని వన్డే సెంచరీల సంఖ్య మరింత పెరిగింది.

బవూమా కెప్టెన్సీ ఇన్నింగ్స్

మరోవైపు టెంబా బవూమా ఒత్తిడిలో అద్భుతంగా ఆడి 103 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ఆరంభంలో రెండు వికెట్లు తీసినా.. బవూమా ఇన్నింగ్స్‌ను నిలబెట్టి జట్టుకు  భారీ స్కోరు 365/9 కు బలమైన పునాది వేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మిల్లర్ తన తల్లి జెన్నీ పేరుతో ఉన్న షర్ట్ ధరించి ‘Pink Day’ ప్రచారంలో భాగమయ్యాడు. జెన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కోలుకున్న సర్వైవర్. ఈ సందర్భంగా సౌతాఫ్రికా జట్టు క్యాన్సర్ బాధితులు, సర్వైవర్స్‌కు మద్దతుగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

సిరీస్‌పై సౌతాఫ్రికా పట్టు

డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 297/8 స్కోరు చేసి, ఆస్ట్రేలియాను 230 పరుగులకే ఆలౌట్ చేసి 67 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలోనూ గెలిస్తే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకునే అవకాశం ప్రొటీస్‌కు ఉంటుంది.

ఇక ఈ సిరీస్‌లో మూడో వన్డే సెప్టెంబర్ 30న పోట్చెఫ్‌స్ట్రూమ్‌లో జరగనుంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌కు ముందు ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకమైన సన్నాహకంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper