Homeఎంటర్టైన్మెంట్Aggipette Macha: 'అగ్గిపెట్టె మచ్చ' కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం!

Aggipette Macha: ‘అగ్గిపెట్టె మచ్చ’ కి తీవ్ర అస్వస్థత..పరిస్థితి విషమం!

Aggipette Macha: సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు ‘అగ్గిపెట్టె మచ్చ’. తన బూతు మాటలతో, ఫ్రస్ట్రేషన్ తో అగ్గిపెట్టె మచ్చ మాట్లాడే మాటలను నెటిజెన్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటికీ సోషల్ మీడియా లో అగ్గిపెట్టె మచ్చ కి సంబంధించిన మీమ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలాంటి అగ్గిపెట్టె మచ్చ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమించింది. గత కొద్దిరోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న అగ్గిపెట్టె మచ్చ, ఈ నెల 5న […]

Aggipette Macha: సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేరు ‘అగ్గిపెట్టె మచ్చ’. తన బూతు మాటలతో, ఫ్రస్ట్రేషన్ తో అగ్గిపెట్టె మచ్చ మాట్లాడే మాటలను నెటిజెన్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటికీ సోషల్ మీడియా లో అగ్గిపెట్టె మచ్చ కి సంబంధించిన మీమ్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలాంటి అగ్గిపెట్టె మచ్చ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమించింది. గత కొద్దిరోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న అగ్గిపెట్టె మచ్చ, ఈ నెల 5న SVIMS హాస్పిటల్ లో చేరాడు. డాక్టర్లు అతని ఆరోగ్య పరిస్థితి ని పరిశీలించి , విషమించినట్టు కుటుంబ సబ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మచ్చ కి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.

అగ్గిపెట్టె మచ్చ అసలు పేరు కిరణ్ కుమార్. ఈయన తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి. సోషల్ మీడియా లో ఒక యూట్యూబర్ కిరణ్ ని కలిసినప్పుడు , అతను ఆవేశం తో మాట్లాడిన మాటలను అప్లోడ్ చేయగా , ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుండి ప్రముఖ యూట్యూబర్స్ అందరూ కిరణ్ తో ఇంటర్వ్యూస్ చేయడం, అతన్ని రెచ్చగొట్టి వీడియోలు చేయించడం వంటివి చేసేవారు. ఒక్కో వీడియో కి కొంత అమౌంట్ ని ఆయనకు అందించేవారు. ఈమధ్య కాలం లో అగ్గిపెట్టె మచ్చ లేటెస్ట్ వీడియోలు సోషల్ మీడియా లో కనిపించడం లేదు. ఆయన చివరి వీడియోల్లో నా ఆరోగ్యం సరిగా లేదని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అవి సాధారణమైన సమస్యలే అని అనుకున్నారు కానీ , కట్ చేస్తే ఆయన్ని హాస్పిటల్ కి చేర్పించి వెంటిలేటర్ పై చికిత్స అందించే రేంజ్ అని ఊహించలేకపోయారు నెటిజెన్స్.

కిరణ్ కి వచ్చిన క్రేజ్ కారణంగా , ఆయన్ని పలు టీవీ షోస్ కి కూడా పిలిచారు. రెండు మూడు సినిమాల్లో కూడా నటించాడు. అందులో కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే చిత్రం కూడా ఉంది. కెరీర్ మంచి ఊపు మీద వెళ్తున్న సమయం లోనే ఆయనకు ఇలాంటి ఆరోగ్య పరిస్థితి రావడం బాధాకరం. కిరణ్ ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉండేవాడు. అదే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఆయన త్వరగా కోలుకోవాలని , ఎప్పటి లాగానే ఆడియన్స్ ని అలరించాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper