Homeఎంటర్టైన్మెంట్Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు...

Priyanka Singh: అమ్మాయి గా మారడానికి ప్రియాంక సింగ్ పడిన ఈ కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

Priyanka Singh: జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సెలెబ్రిటీలలో ఒకరు ప్రియాంక సింగ్. ఈమె ముందుగా ఒక అబ్బాయి. పేరు సాయి తేజ. కానీ ఆయన అమ్మాయి గా మారేందుకు ఇష్టపడ్డాడు. అందుకు కోసం పడిన కష్టాలను రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకోగా , అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు వింటే ఎలాంటి వాడికైనా కన్నీళ్లు […]

Priyanka Singh: జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సెలెబ్రిటీలలో ఒకరు ప్రియాంక సింగ్. ఈమె ముందుగా ఒక అబ్బాయి. పేరు సాయి తేజ. కానీ ఆయన అమ్మాయి గా మారేందుకు ఇష్టపడ్డాడు. అందుకు కోసం పడిన కష్టాలను రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకోగా , అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు వింటే ఎలాంటి వాడికైనా కన్నీళ్లు రాక తప్పదు. ప్రియాంక సింగ్ అబ్బాయి నుండి పూర్తిగా అమ్మాయిగా మారడానికి నిన్నటితో పదేళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ట్రాన్స్ జెండర్’ గా మారడానికి ఎన్నో కష్టాలు పడ్డానని , ముంబై వెళ్లి ఎన్నో అవస్థలు పడి లింగమార్పిడి చేయించుకున్నని చెప్పుకొచ్చింది.

ట్రాన్స్ జెండర్ గా మారిన తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకోవడం తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురుకున్నానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆపరేషన్ సమయం లో ఆమె తీసుకున్న కొన్ని ఫోటోలను కూడా నెటిజెన్స్ కి చూపించింది. ఇవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ట్రాన్స్ జెండర్ గా నా జీవిత ప్రయాణాన్ని ప్రారంభించిన రోజు నుండి ఇప్పటి వరకు నేను పడిన ఆవేదన , కన్నీళ్లు , నిద్ర లేని రాత్రులు , రక్తస్రావం , గందరగోళం వంటివి మాటల్లో వర్ణించలేను. నా భవిష్యత్తు ఏంటో అని నన్ను నేను ప్రశ్నించుకున్న క్షణాల్లో నాలో కలిగిన ఆవేదన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ఎమోషనల్ అయ్యింది. పదేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని తలచుకొని వెనక్కి తిరిగి చూసుకుంటే అనేక అధ్యాయాలతో నిండిన ఒక జీవితం నాకు కనిపిస్తోంది. అందులో ఎంతటి బాధాకరమైన సంఘటనలు ఉన్నాయో , అంతే సంతోష కరమైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈరోజు అద్దం లో నన్ను నేను చూసుకుంటే నాపై నాకు ఎంతో గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper