RBI Repo rate: దేశంలో పెరుగుతున్న ధరలు.. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు.. రూపాయి బలహీనత నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు రేటు విషయంలో నాలుగేళ్ల తర్వాత ఒక కీలక అడుగు వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకుంది.
ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటును 5.50 శాతానికి పెంచింది. దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లు పెంచింది. 2023 ఫిబ్రవరిలో రెపో రేటును ఆర్బిఐ పెంచింది. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్వల్పకాలిక రుణాల మీద వసూలు చేసే వడ్డీ. దీనిని పెంచడం ద్వారా వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని కొంతమేర నియంత్రించి.. డిమాండ్ ను తిరోగమనంలో ఉండేలా చేస్తుంది. తద్వారా ధరలను అదుపులోకి తీసుకురావడం ఆర్బీఐ ప్రధాన లక్ష్యం.
ఇటీవల కాలంలో ధరల ఒత్తిళ్లు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరల పెరుగుదల.. ఆహార ధరలు.. రూపాయ విలువలో బలహీనత.. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు వంటివి ఇబ్బంది పెడుతున్నాయి ఆగస్టు నెలలో దేశ రిటైల్ ధరల పెరుగుదల ఏకంగా 4.82 శాతానికి చేరుకుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యకాలిక నాలుగు శాతం లక్ష్యానికి మించి ఉంది.
ఇదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ గ్రోత్ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో అభివృద్ధికి పెద్దగా నష్టం కలగకుండా ధరలను కట్టడి చేయాలని ఆర్బిఐ నిర్వహించింది. అందువల్లే ఈసారి 25 బేసిస్ పాయింట్లు స్వల్ప పెంపును నిర్ణయించుకుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వల్ల బ్యాంకుల రుణాల మీద వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లు.. కార్ లోన్లు.. పర్సనల్ లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ భారం పెరిగే అవకాశం ఉంది. అయితే బ్యాంకులు ఈ పెంపును పూర్తిగా లేదా వెంటనే కస్టమర్లకు బదిలీ చేస్తాయా లేదా అనేది వాటి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్లు.. ఇతర పొదుపు పథకాలపై వడ్డీ పెరిగే అవకాశం ఉండడంతో డిపాజిటర్లకు కొంతమేర ప్రయోజనం కలిగించవచ్చు.
వడ్డీ రేట్లు పెంచినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశావహ దృక్పథంతో ఉంది. 2026 -27 ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి అంచనాను 7.1 శాతానికి పెంచింది. అదే సమయంలో ఫ్రైస్ ఇండెక్స్ ను 5.2 శాతానికి మార్చింది. మొత్తంగా చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిర్ణయం ధరలను అదుపులో పెట్టేందుకు కఠిన వైఖరి వైపు అడుగులు వేస్తున్న సంకేతంలాగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఆహారం.. ఇంధన ధరలు ఎలా ఉంటాయనేది తదుపరి వడ్డీ నిర్ణయాలకు కీలకం కాబోతోంది.