Rise Survey Praveen Pullata : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒకవైపు అధికార కూటమి పార్టీలు, మరోవైపు విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక, వ్యూహప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లాలో అధికార కూటమి గ్రాఫ్ ఎలా ఉంది? గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రముఖ సర్వే సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
ఇందులో భాగంగా.. రైజ్ సర్వే సంస్థ అధినేత, పొలిటికల్ అనలిస్ట్ ప్రవీణ్ పుల్లట గారు వెల్లడించిన తాజా సర్వే వివరాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మూడు జిల్లాల పరిధిలో కూటమి పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం
ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికి వస్తే… ఇక్కడ సర్వే ప్రకారం కూటమికి కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ లేదా ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.
కోనసీమ జిల్లాలో కూటమికి రిస్క్ జోన్ లో ఉన్న నియోజకవర్గాలుగా
రాజోలు
పి. గన్నవరం
రామచంద్రాపురం
ఈ మూడు నియోజకవర్గాలను సర్వే పేర్కొంది. ఇందులో రాజోలు, పి. గన్నవరం స్థానాలు జనసేన చేతిలో ఉండగా రామచంద్రాపురం టీడీపీ చేతిలో ఉంది.
ఇక కూటమికి స్పష్టమైన ఆధిపత్యం ఉంటూ సేఫ్ జోన్ లో ఉన్న స్థానాలు
ముమ్మిడివరం
కొత్తపేట
ఈ రెండూ టీడీపీ స్థానాలు.
ఇక టఫ్ ఫైట్ నడుస్తున్న అమలాపురం నియోజకవర్గంలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోందని ప్రవీణ్ పుల్లట తన సర్వేలో వెల్లడించారు.
ఇక విభజన తర్వాత ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా విషయానికి వస్తే… ఇక్కడ కూడా కూటమికి కీలక నియోజకవర్గాల్లో సవాళ్లు ఎదురవుతున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది.
ఇక్కడ కూటమికి రిస్క్ జోన్ లో ఉన్న సీట్లు
రాజానగరం
కొవ్వూరు
నిడదవోలు
గమనించాల్సిన విషయమేమిటంటే.. రాజానగరం, నిడదవోలు స్థానాలు జనసేన ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొవ్వూరు టీడీపీ ఖాతాలో ఉంది.
కూటమికి పూర్తి అనుకూలంగా, సేఫ్ జోన్ లో ఉన్న నియోజకవర్గాలు
గోపాలపురం
రాజమండ్రి రూరల్
ఈ రెండూ టీడీపీ స్థానాలు.
ఇక ఫలితం ఎటువైపు అయినామొగ్గే అవకాశం ఉన్న మిశ్రమ స్పందన కలిగిన సీట్లు
అనపర్తి (బీజేపీ సీటు)
రాజమండ్రి సిటీ (టీడీపీ సీటు)
చివరిగా కాకినాడ జిల్లా విషయానికి వస్తే… సర్వే వివరాల ప్రకారం ఇక్కడే కూటమికి అత్యంత ఎక్కువ సంఖ్యలో ‘రిస్క్ జోన్’ నియోజకవర్గాలు ఉండటం గమనార్హం.
కాకినాడ జిల్లాలో ఏకంగా 4 నియోజకవర్గాలు కూటమికి రిస్క్ జోన్ లో ఉన్నాయని సర్వే పేర్కొంది.
తుని (టీడీపీ)
ప్రత్తిపాడు (టీడీపీ)
కాకినాడ రూరల్ (జనసేన)
కాకినాడ సిటీ (టీడీపీ)
ఈ స్థానాల్లో స్థానిక సంస్థల పోరు కూటమికి అంత సులువు కాదనే సంకేతాలు వస్తున్నాయి.
ఇక కూటమికి మంచి పట్టు ఉన్న సేఫ్ జోన్ నియోజకవర్గాలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన స్థానం పిఠాపురం
జగ్గంపేట (టీడీపీ)
పెద్దాపురం (టీడీపీ)”
మొత్తంగా చూస్తే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట వెల్లడించిన ఈ గణాంకాలు కూటమి శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురం, రాజమండ్రి రూరల్, కొత్తపేట వంటి స్థానాల్లో సేఫ్ జోన్ కనిపిస్తున్నప్పటికీ… కాకినాడ, రాజానగరం, రాజోలు, నిడదవోలు వంటి పలు కీలక స్థానాల్లో రిస్క్ జోన్ ఉండటం కూటమి నేతలను ఆలోచనలో పడేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ఈ పరిస్థితిని కూటమి ఎలా అధిగమిస్తుంది? విపక్ష వైఎస్సార్సీపీ ఈ వ్యూహాలను ఎలా అనుకూలంగా మలచుకుంటుంది అనేది వేచి చూడాలి!
మీ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.