Djokovic: ఒకప్పుడు అతను టెన్నిస్ ప్రపంచాన్ని ఏలాడు. గ్రాండ్ స్లామ్ లు సొంతం చేసుకున్నాడు. ఎర్ర మట్టి.. పచ్చగడ్డి.. ఇలా కోర్టులతో సంబంధం లేకుండా అదరగొట్టాడు. యూఎస్ ఓపెన్.. ఫ్రెంచ్ ఓపెన్.. వింబుల్డన్.. ఆస్ట్రేలియన్ ఓపెన్.. ఇలా అన్నిట్లోనూ తిరుగులేని మొనగాడిలాగా నిలిచాడు.
రోజులు మొత్తం ఒకే విధంగా ఉండవు. వయసు ఉన్నప్పుడు శరీరం ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది. అదే వయసు మళ్లీ పోతుంటే ఆ స్థాయిలో ఉత్సాహం ఉండదు. ఆ స్థాయిలో దూకుడు కనిపించదు. కానీ ఇవి ఈ సెర్బియన్ ఆటగాడి ముందు దిగదుడుపు. ఎందుకంటే అతడు మైదానంలోకి దిగితే.. రాకెట్ పట్టుకొని బంతిని గట్టిగా కొడితే.. ప్రత్యర్థులకు సింహ స్వప్నాలే. అతడి వయసు ప్రస్తుతం 39 సంవత్సరాలు. ఆయనప్పటికీ తగ్గేదే లేదు అన్నట్టుగా ఆడుతున్నాడు. మామూలు ఆట కాదు అది..
తాజాగా బీజింగ్ ఓపెన్ లో సత్తా చూపించాడు సెర్బియన్ ఆటగాడు జకోవిచ్. 39 సంవత్సరాలలో వయసులో కూడా జ్వెరెవ్ కు షాక్ ఇచ్చాడు. బీజింగ్ గడ్డమీద తనకు తిరుగు లేదని నిరూపించాడు. ఇన్ ఫామ్ లో ఉన్న జ్వెరెవ్ ను ఓడించాడు. ఏకంగా టైటిల్ కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు.. జ్వెరెవ్ జకోవిచ్ కు పోటీ ఇచ్చినప్పటికి.. దానిని తుది వరకు కొనసాగించలేకపోయాడు. జకోవిచ్ కీలక సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా ప్రత్యర్థి మీద పై చేయి సాధించాడు.
మ్యాచ్ ప్రారంభం నుంచి ఇద్దరు ప్లేయర్లు హోరాహోరీగా ఆడారు.. జ్వెరెవ్ తన పదునైన సర్వీస్.. బేస్ లైన్ షాట్లతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినప్పటికీ జకోవిచ్ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అంతేకాదు, ఎక్కడ కూడా తొందరపడకుండా జకోవిచ్ ఆడాడు. ర్యాలీలను పొడిగించాడు. అంతేకాదు ప్రత్యర్థి బలహీనతలను గుర్తించి.. పాయింట్ల పట్టికలను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా కీలక పాయింట్లు వద్ద జకోవిచ్ ప్రశాంతత చూపించాడు. అది మ్యాచ్ ను మరో మలుపు తిప్పింది..జ్వెరెవ్ ఎంత దూకుడుగా ఆడినప్పటికీ జకోవిచ్ డిఫెన్స్ ముందు అతడు వ్యూహాలు పనిచేయలేదు. అవసరమైన సమయంలో బ్రేక్ పాయింట్లు సాధిస్తూ మ్యాచ్ మీద జకోవిచ్ పట్టు సాధించాడు.
బీజింగ్ కోర్టులు జకోవిచ్ కు అత్యంత అనుకూలమైనవి. పైగా అతడికి అద్భుతమైన రికార్డులు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో అతడు అడుగుపెట్టినప్పటి నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి.. ఇప్పుడు ఏకంగా అత్యంత ప్రమాదకరమైన జ్వెరెవ్ ను ఓడించి సెమీస్ చేరుకున్నాడు.. ఈ మ్యాచ్ కు ముందు జ్వెరెవ్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. వరుస విజయాలు సాధించాడు. జకోవిచ్ కు గట్టి పోటీ ఇచ్చాడు. అయితే కీలక దశలో జకోవిచ్ అనుభవం ముందు తేలిపోయాడు.
సెమి ఫైనల్ చేరుకున్నప్పటికీ జకోవిచ్ కు బీజింగ్ ఓపెన్ అంత ఈజీ కాదు. సెమీఫైనల్ లో అతడు కఠినమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.. వయసు పెరుగుతున్నప్పటికీ తన ఆటలోని పదును ఏమాత్రం తగ్గలేదని జకోవిచ్ నిరూపించాడు. బీజింగ్లో తన పరిపూర్ణమైన రికార్డును కాపాడుకున్నాడు. సెమీ ఫైనల్ చేరుకొని.. టైటిల్ మీద కన్ను వేశాడు.
Omg 39 year old Novak Djokovic beats new 2× Grandslam winner Zverev in 3 sets to extend his Beijing streak to 32-0 ! Nole u are eternal #ChinaOpen https://t.co/3jmXRkElyw
— Raul (@Raulgunner2) October 4, 2026