Homeక్రీడలుక్రికెట్‌Arshdeep Singh Girlfriend: ఏదో కవర్ చేసాడు గాని.. అర్ష్ దీప్ సింగ్ ఆమెతో దొరికిపోయాడు..

Arshdeep Singh Girlfriend: ఏదో కవర్ చేసాడు గాని.. అర్ష్ దీప్ సింగ్ ఆమెతో దొరికిపోయాడు..

Arshdeep Singh Girlfriend: ” ఆమెతో నాకు ఎందుకు లింక్ పెడుతున్నారు. అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి” ఇటీవల మీడియాను ఉద్దేశించి అర్ష్ దీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. దీంతో ఆమెతో అర్ష్ దీప్ సింగ్ కు ఎటువంటి సంబంధం లేదని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. నేటి కాలంలో సోషల్ మీడియా బలంగా ఉంది. సెలబ్రిటీలు చిన్న అడుగు బయటకు వేసినా సరే వెంటనే తెలిసిపోతుంది. ఇప్పుడు అర్ష్ దీప్ సింగ్ వ్యవహారం కూడా […]

Arshdeep Singh Girlfriend: ” ఆమెతో నాకు ఎందుకు లింక్ పెడుతున్నారు. అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి” ఇటీవల మీడియాను ఉద్దేశించి అర్ష్ దీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. దీంతో ఆమెతో అర్ష్ దీప్ సింగ్ కు ఎటువంటి సంబంధం లేదని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది వేరు. నేటి కాలంలో సోషల్ మీడియా బలంగా ఉంది. సెలబ్రిటీలు చిన్న అడుగు బయటకు వేసినా సరే వెంటనే తెలిసిపోతుంది. ఇప్పుడు అర్ష్ దీప్ సింగ్ వ్యవహారం కూడా అలానే బయటపడింది.

అర్ష్ దీప్ సింగ్ సమ్రీన్ కౌర్ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు కొంతకాలంగా ప్రచారంలో ఉంది. దీనిపై అతడు గాని.. ఆమె గాని అధికారికంగా ఇప్పటివరకు స్పందించింది లేదు. సింగ్ మీద రకరకాల పుకార్లు వచ్చినప్పటికీ అతడు వాటిని తేలికగా తీసుకున్నాడు. ఇటీవల మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే అటువంటిది ఏమీ లేదని స్పష్టం చేశాడు. అయితే గురువారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ కోసం కౌర్ మైదానానికి వచ్చింది. అక్కడ సింగ్ బౌలింగ్ ప్రదర్శనను చూసి హర్షం వ్యక్తం చేసింది. ఆ తర్వాత మైదానం నుంచి బయటికి వస్తుండగా కొంతమంది ఆ దృశ్యాలను వీడియో తీశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

“ఇలాంటి వ్యవహారాలు దాచేస్తే దాగిపోవు. బయటికి తెలుస్తూనే ఉంటాయి. సింగ్ గోప్యత పాటించాడు. కౌర్ దానిని అనుసరించింది. కానీ కొంతమంది మాత్రం వీరిద్దరిని ఫాలో అయ్యారు. చివరికి జరిగింది ఏంటో మీకే తెలుస్తోందని” నెటిజన్లు అంటున్నారు.

కాగా, అర్ష్ దీప్ సింగ్ ప్రస్తుత ఐపీఎల్ లో పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్నాడు. టి20 లలో టీమిండియాకు వెన్నెముకలాగా మారిపోయాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. టి20 లలో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఎటువంటి నేపథ్యం లేకుండానే క్రికెట్ లోకి వచ్చిన అతడు.. తనను తాను నిరూపించుకున్నాడు. ఫలితంగా నేడు ఈ స్థాయిలో నిలబడ్డాడు. కష్టాలు, కన్నీళ్లు తాత్కాలికమని.. విజయం మాత్రమే శాశ్వతమని అతడు నిరూపిస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper