Homeఆధ్యాత్మికంToday horoscope in telugu ': ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్త.. ఆ పని...

Today horoscope in telugu ‘: ఈ రాశి ఉద్యోగులు ఈరోజు జాగ్రత్త.. ఆ పని మొదలుపెడితే అడ్డంకులే..

‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఏ రోజు చంద్రుడు, గురుడు కలిసి నవ పంచమి యోగం ఏర్పాటు చేయనున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి లాభదాయకం ఉంటుంది. కానీ చాలా రాశుల వారికి ఆందోళనకరమైన వాతావరణం ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఏ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. అయితే ఉద్యోగులకు కాస్త కష్టాలు ఎదురవుతాయి. అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. స్నేహితులను కలుస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈ రోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వ్యాపారులకు కొన్ని పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దల సలహా తీసుకోవాలి. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులో కొత్తగా ఏర్పాటు చేసుకున్న భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు ఈరోజు మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానీయకుండా చూడాలి. అయితే కొన్ని పనుల వల్ల కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఇతరుల సలహా తీసుకోవాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తాను. ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే కొన్ని కారణాలవల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలా ఉండడం వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు పొందుతారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈరోజు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటుంది. అందువల్ల వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు. దీంతో కాస్త నిరాశగా ఉంటారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరిగిన ఆదాయం రావడంతో ఇబ్బందులు ఉండవు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కొత్తవారికి ధనం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈరోజు ఈ రాశి వారి కుటుంబ వాతావరణం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు మౌనంగా ఉండటమే మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఘర్షణ అంత మంచిది కాదు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులు కాస్త కష్టపడాల్సి వస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. డబ్బు సంపాదించడం చాలా కష్టంగా మారుతుంది. వ్యాపారాలు కొత్తపెట్టబడును పెడతారు. అయితే పెద్దల సలహా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులకు ఊహించని ధన లాభం ఉంటుంది. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఇంటి విషయాల్లో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కష్టం ఎదురైతే పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు అదనపు ప్రయోజనాన్ని పొందుతారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు ఎదురవుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. అయితే ఉద్యోగులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాతావరణం కాస్త ఆందోళనగా ఉంటుంది. అయితే కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. అవసరం మేరకు మాత్రమే మాట్లాడాలి. విదేశాల నుంచి శుభవార్త వింటారు విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు కెరీర్ పరంగా బాగుంటుంది. కార్యాలయాల్లో అదనపు ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడును పెడతారు. ఇది లాభాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు లాభాలను తీసుకొస్తాయి.

 

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular