IPL 2025 : కొంతమంది పరుగులు.. ఇంకొంతమంది వికెట్లు పడగొట్టి తమకంటూ ప్రత్యేక రికార్డులను సృష్టించుకుంటున్నారు. అయితే రికార్డులకే బాబుల్లాంటి ఆటగాళ్లు ఆదివారం సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఐపీఎల్ లో అరుదైన ఘట్టాన్ని అభిమానులకు సరికొత్తగా పరిచయం చేశారు.. ప్రస్తుతం టి20 మినహా.. మిగతా ఫార్మాట్ లలో టీమిండియా కు కుడి, ఎడమ భుజాలుగా పేరుపొందిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ .. ఆదివారం నాటి మ్యాచ్లలో సంచలనాలు సృష్టించారు. “బ్యాటింగ్ సరిగ్గా చేయడం లేదు. పరుగులు సరిగా తీయడం లేదు. వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాలి” అని నినదిస్తున్న గొంతులకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ బ్యాట్ ద్వారా సమాధానం చెప్పారు. అంతేకాదు తాము నిలబడితే.. గట్టిగా కలబడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్లకు రుచి చూపించారు.
Also Read : విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన ఘనత..
విరాట్ కోహ్లీ
పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 73 పరుగులు చేశాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు చివరి వరకు ఉన్నాడు. నాట్అవుట్ గా నిలవడం మాత్రమే కాదు.. బెంగళూరు జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. కొన్నిసార్లు దూకుడుగా.. మరికొన్నిసార్లు సమయోచితంగా బ్యాటింగ్ చేసి.. బెంగళూరు జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (107) చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో 106 హాఫ్ సెంచరీలతో డేవిడ్ వార్నర్ తొలి స్థానంలో ఉండగా.. అతడి రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. ప్రారంభం నుంచి చివరి వరకు దూకుడుగా బ్యాటింగ్ చేసి.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.. తద్వారా బెంగళూరు జట్టుకు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయం ద్వారా బెంగళూరు జట్టు తన ప్లే ఆఫ్ ఆశలను మరింత బలోపేతం చేసుకుంది.
రోహిత్ శర్మ
చాలా రోజులుగా ఐపీఎల్లో రోహిత్ శర్మ ఊహించినంత స్థాయిలో ప్రతిభ చూపించలేకపోతున్నాడు. గత సీజన్ నాటి నుంచి రోహిత్ శర్మ అంతగా బ్యాటింగ్ చేయడం లేదు. ఏదో చుక్క తెగిపడినట్టు మాత్రమే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇది ముంబై జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలువరిస్తోంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గొప్పగా చెప్పుకునే ఇన్నింగ్స్ ఒకటి కూడా ఆడలేదు. దానివల్ల ముంబై జట్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆదివారం జరుగుతున్న మ్యాచ్ ముంబైకి అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటికే పాయింట్ల పట్టికలో ముంబై జట్టు ఏడవ స్థానంలో కొనసాగుతోంది.. అయితే ఆదివారం చెన్నై తో జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. ఈ గెలుపులో ముంబై జట్టు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ముఖ్యపాత్ర పోషించాడు. చాలా రోజుల తర్వాత అతడు సూపర్ బ్యాటింగ్ చేశాడు. ప్రారంభం నుంచి చివరి వరకు ముంబై జట్టు ఓకే తీరుగా ఆడింది. ముంబై జట్టులో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతేకాదు ముంబై జట్టు సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించాడు. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడంతో ముంబై అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే అయితే ఈ సీజన్లో హాఫ్ సెంచరీ చేయడం రోహిత్ శర్మకు ఇదే తొలిసారి. చెన్నై జట్టు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్.. ప్రారంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. తనకు మాత్రమే సాధ్యమైన షాట్లు ఆడాడు. తద్వారా ముంబై జట్టు అభిమానులను అలరించాడు. ముంబై జట్టు ముందుగా బౌలింగ్ చేసి.. చెన్నై ప్లేయర్లను నిలువరించింది. ఆ తర్వాత చేజింగ్ కు దిగి అదరగొట్టింది.
Also Read : రోహిత్ ఘనత.. ముంబై సరికొత్త చరిత్ర.. చెన్నై పై ఎన్ని రికార్డులో?!