Homeఆధ్యాత్మికంHoroscope: 26-11-2026 గురువారం.. ఈ 12 రాశుల వారిలో అదృష్టం.. దురదృష్టం వీళ్ళకే..

Horoscope: 26-11-2026 గురువారం.. ఈ 12 రాశుల వారిలో అదృష్టం.. దురదృష్టం వీళ్ళకే..

Horoscope: గురువారం (నవంబర్ 26) రోజుల గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావాల ఆధారంగా ద్వాదశరాసుల వారికి భిన్నమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కొందరికి ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూల పరిస్థితులు ఎదురు కావచ్చు. మరికొందరికి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు.. ఆరోగ్యం.. ప్రయాణాల వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం అత్యంత మంచిది. పంచాంగ వివరాల ప్రకారం ఈరోజు కృష్ణపక్ష […]

Horoscope: గురువారం (నవంబర్ 26) రోజుల గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావాల ఆధారంగా ద్వాదశరాసుల వారికి భిన్నమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కొందరికి ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూల పరిస్థితులు ఎదురు కావచ్చు. మరికొందరికి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాలు.. ఆరోగ్యం.. ప్రయాణాల వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం అత్యంత మంచిది. పంచాంగ వివరాల ప్రకారం ఈరోజు కృష్ణపక్ష విదియ తిధి మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. అనంతరం తదియ మొదలవుతుంది. మృగశిర నక్షత్ర ప్రభావం బలంగా ఉంటుంది.

మేష రాశి (Aries)

ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగరంగంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. పై అధికారులు ప్రశంసలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభ రాశి (Taurus)

వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభ నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చు కోవడానికి అనుకూలమైన రోజు. డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు నాలుక మీద నియంత్రణ అవసరం. పాత వివాదాలను మళ్లీ ప్రస్తావించకపోవడమే మంచిది.

మిధున రాశి (Gemini)

మిధున రాశి వారికి ఈరోజు కొత్త ఆలోచనలు వస్తాయి. ఉద్యోగ.. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికంటే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. సహ ఉద్యోగులతో చర్చలు ప్రయోజనకరంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు.. ఆన్లైన్లో కొనుగోలు వల్ల ఖర్చులు పెరగొచ్చు.

కర్కాటక రాశి (cancer)

కర్కాటక రాశి వారికి ఈరోజు బాధితులు పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆయనప్పటికీ వారు వాటిని ఓర్పుతో పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ చూపుతారు. ఇంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు నిపుణులతో సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది.

సింహరాశి (Leo)

సింహరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనులు ముందుకు సాగుతాయి. స్నేహితులు సాకారం అందించడంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. కుటుంబంతో కలిసి శుభవార్తలు వినే అవకాశం ఉంది.

కన్యరాశి (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధితులు చేపడుతారు. వ్యాపారస్తులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపితే మంచి ఫలితాలు వస్తాయి.

తులారాశి (Libra)

తుల రాశి వారికి ఈ రోజు కొంత ఓర్పు అవసరం. చేపట్టే పనులు అనుకున్న సమయానికి పూర్తిగా కాకపోవచ్చు. ఉద్యోగంలో సహ ఉద్యోగులతో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సలహాలు ఉపయోగపడతాయి.

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొంత సవాళ్లతో కూడుకున్నదిగా ఉండవచ్చు. అనుకోని పనులు ఎదురు కావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. ఉద్యోగం.. వ్యాపారం రంగాలలో ఓర్పుతో ముందుకు సాగాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. అనవసరమైన విభాగాలకు దూరంగా ఉండాలి.

ధనస్సు రాశి (Sagittarius)

ధనస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.

మకర రాశి (capricorn)

మకర రాశి వారికి ఈరోజు శత్రులపై విజయం సాధించే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. అప్పుల వ్యవహారంలో కొంత ఉపశమనం లభిస్తుంది.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి రోజు. కోర్టు, చట్టపరమైన వ్యవహారాలలో ముందడుగు పడవచ్చు. ఆర్థిక విషయాలలో ప్రణాళిక బద్ధంగా ఉండాలి.

కుంభరాశి (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అనుకున్న పనులలో జాప్యం ఎదురవుతుంది. ఉద్యోగంలో ఏకాగ్రత అవసరం. విద్యార్థులు చదువు మీద మరింత దృష్టి పెట్టాలి. షేర్ మార్కెట్.. ఊహాజనిత పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మీన రాశి (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు కుటుంబ వ్యవహారాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇంట్లో చిన్నపాటి సమస్య ఎదురైనా సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో పని భారం పెరగవచ్చు. ఆర్థిక విషయాలలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి సమయం కలపడం మంచిది. కొత్త పనులు ప్రారంభించేముందు సరైన ప్రణాళిక అవసరం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper