Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 3.9.2026 : ఈ నక్షత్ర ప్రభావం.. 12 రాశుల వారి...

Today horoscope in telugu 3.9.2026 : ఈ నక్షత్ర ప్రభావం.. 12 రాశుల వారి జీవితాల్లో మార్పులు.. మీ రాశి ఎలా ఉందో చెక్ చేసుకోండి..

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఈ రోజు ఆర్థిక రంగాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. మీషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ధనసంచారం అధికంగా ఉంది. దీనివల్ల వీరు ఆర్థికంగా […]

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఈ రోజు ఆర్థిక రంగాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. మీషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేషరాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ధనసంచారం అధికంగా ఉంది. దీనివల్ల వీరు ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు. మాట తీరు బాగుండడంతో ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు ఇది కలిసి వస్తుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలను పొందుతారు. కత్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. దీంతో కొన్ని పనులు చేయడానికి ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. ఉద్యోగులకు అన్ని కలిసి వస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ప్రశంసలు అందడంతో ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు. ఆలోచనలు ప్రతికూలంగా మారకుండా జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం. వచ్చిన దాంట్లో పొదుపు చేయడం చాలా అవసరం. విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం గరనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. పాత పెట్టుబడులపై ఇప్పుడు లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు పదోన్నతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడంతో ఉత్సాహంగా పనిచేస్తారు. నిరుద్యోగులు కొన్ని కార్యాలయాల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఆటంకాలు తొలగిపోయి ముందుకు సాగుతుంది కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడతారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు అదృష్టాన్ని పొందుతారు. అనుకోకుండా ఇంట్లోకి ధన లాభం ఉంటుంది. పూర్వికులు ఆస్తిపై శుభవార్తలు విని అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. పై చదువుల కోసం విదేశీ ప్రయాణాలు చేయాల్సివస్తుంది. విద్యార్థులు పోటీపరచిన పాల్గొంటే విజయం సాధిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాల అనుకూలతలతో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా రిస్కు తీసుకునే పనులు చేస్తారు. అయితే కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటమే మంచిది. సాంకేతిక రంగాల్లో పనిచేసే వారికి అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలు. కొత్తగా పెళ్లి చేసుకునే వారికి సంబంధాలు చూస్తుంటారు. వ్యాపారులకు భాగస్వాముల సహాయంతో అధిక లాభాలు పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. మాటతీరుతో సమాజంలో గౌరవాన్ని పొందుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ధైర్య సాహసాలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు. అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ధాన్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరితోనూ అనవసరపు వివాదాలకు చొరవ ఇవ్వద్దు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కళాకారులకు కలిసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆన్లైన్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణ ఉంటుంది. గతంలో కంటే ఆరోగ్యం ఎరుగుపడుతుంది. ఆత్మీయులు కలవడంతో మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. కొన్ని పనులు ఉత్సాహంగా చేయడానికి ఆసక్తి చూపుతారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది. తోపుటోల నుంచి కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. బ్యాంకు లోను ఉన్నవారు ఏమాత్రం ఆందోళన చేయకుండా వెంటనే డబ్బులు చెల్లించే ఏర్పాటు చేయాలి. అప్పుల బాధ నుంచి బయటపడే మార్గం ఏర్పడుతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper