Rohith Sharma : ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్య కుమార్ యాదవ్ అదరగొట్టారు. వీరు ముగ్గురు చెన్నై బౌలర్లను చితక్కొట్టారు. ముఖ్యంగా రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు..76* పరుగులు చేసి అదరగొట్టాడు. చెన్నై బౌలర్ల బౌలింగ్ ను ఒక ఆట ఆడుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా పూనకం వచ్చినట్టు బ్యాటింగ్ చేశాడు. 30 బంతుల్లోనే 68* పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. చెన్నై పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన నేపథ్యంలో.. రోహిత్ శర్మ అనేక రికార్డులు సృష్టించాడు. అతడి ద్వారా ముంబై జట్టు కూడా అనితర సాధ్యమైన ఘనతలు అందుకుంది.
ఐపీఎల్ చరిత్రలో ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఆటగాడిగా ఏపీ డివిలియర్స్ (25) ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.. గేల్(22), రోహిత్ శర్మ (20*), విరాట్ కోహ్లీ (19), డేవిడ్ వార్నర్ (18), మహేంద్ర సింగ్ ధోని (18) తర్వాత ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెన్నై జట్టుపై 21 విజయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబై ఇండియన్స్, చెన్నై పరస్పరం 39 మ్యాచులలో తలపడగా.. ముంబై ఇండియన్స్ 21 మ్యాచ్లు గెలిచింది.. ఇక ఈ జాబితాలో కోల్ కతా నైట్ రైడర్స్ పై ముంబై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కోల్ కతా తో ముంబై 35 మ్యాచ్లలో తలపడింది. 24 మ్యాచ్లలో గెలిచింది.. ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 34 మ్యాచులు జరగగా.. 21 విజయాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని ముంబై జట్టు ప్రదర్శిస్తున్నది.కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య 34 మ్యాచులు జరగగా.. 21 విజయాలతో కోల్ కతా నైట్ రైడర్స్ ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది..
చెన్నై జట్టుపై రోహిత్ – సూర్య కుమార్ యాదవ్ సెకండ్ వికెట్ కు 114* రన్స్ భాగస్వామ్యం బిల్డ్ చేశారు.. అయితే ఈ జాబితాలో చెన్నై జట్టుపై సెకండ్ వికెట్ కు ముంబై నెలకొల్పిన బిగ్గెస్ట్ పార్ట్నర్ షిప్ రోహిత్ శర్మ – సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది.
2012లో జరిగిన మ్యాచ్లో రోహిత్ – సచిన్ రెండో వికెట్ కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
2015లో రోహిత్ శర్మ – సిమన్స్ 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
2020లో క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్ తొలి వికెట్ కు 116* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
2025 లో రెండో వికెట్ కు రోహిత్ శర్మ – సూర్య కుమార్ యాదవ్ 114* పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇక పరుగులపరంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 8,326 రన్స్ చేసి.. హైయెస్ట్ రన్స్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 6,786 పరుగులతో రోహిత్ శర్మ రెండవ స్థానంలో, 6,769 పరుగులతో శిఖర్ ధావన్ మూడవ స్థానంలో, 6,565 పరుగులతో డేవిడ్ వార్డు మూడో స్థానంలో, 5,528 పరుగులతో సురేష్ రైనా నాలుగో స్థానంలో కూడా కొనసాగుతున్నాడు. గడచిన 4 ఇన్నింగ్స్ లలో చెన్నై జట్టుపై రోహిత్ శర్మ 0, 105*, 0, 76* పరుగులు చేశాడు
2020లో షార్జా వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చెన్నై జట్టు పై 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది.
2008లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో చెన్నై పై గెలుపును సొంతం చేసుకుంది.
2025లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై పై 9 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది.