30 August 2026 Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు పనులు వేగంగా పూర్తవుతాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈరోజు పని ప్రదేశంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరితోనో అనవసరంగా వాదించకూడదు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆగిపోయిన డబ్బు వసూలు అయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు భాగస్వాములు కలిసి రావడంతో ముఖ్యమైన ప్రాజెక్టును పూర్తి చేసి అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సంపూర్ణ మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈరోజు విభిన్నమైన ఆలోచనలు ఉంటాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ రాబడి ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. వ్యాపారాన్ని విస్తరించేందుకు తోటి వారి సహకారం తీసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మానసికంగా ప్రశాంతత కోసం ధ్యానం చేస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. దీంతో చేసే పనుల్లో తిరుగు ఉండదు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కోపాన్ని తగ్గించుకొని మాట్లాడాలి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ప్రతి ఒక్క పనిని ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు. బడ్జెట్ ప్రకారం ఖర్చులు చేయడం అలవాటు చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీపరచలో పాల్గొంటే విజయం సాధిస్తారు. మార్కెట్ రంగంలో ఉన్న ఉద్యోగులకు కలిసి వస్తుంది. శక్తి సామర్థ్యాల మీరకే ఖర్చులు చేయండి. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దీంతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పాత రుణాలు తీరిపోతాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇష్టమైన పనుల కోసం సమయం కేటాయించాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈరోజు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. మార్కెటింగ్ వ్యూహాలతో కంపెనీ అభివృద్ధికి తోడ్పడుతారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. క్రమశిక్షణతో కూడిన ఒప్పందాలు చేసుకోవాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని పనులు వేగంగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి అనుకూలంగా మారుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టులను చేపట్టి తోటి వారి సహాయంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య మెరుగు కోసం తగినంత విశ్రాంతి తీసుకోవాలి
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఓపిక చాలా అవసరం. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. అధికారుల అండదండలతో ఉద్యోగులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఆర్థిక సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందుతాయి. ధ్యానం చేయడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు.