Homeఆధ్యాత్మికం'Today Horoscope in Telugu 20.8.2026 : ఈరోజు అదృష్టాన్ని పొందే 5 రాశులు ఇవే.....

‘Today Horoscope in Telugu 20.8.2026 : ఈరోజు అదృష్టాన్ని పొందే 5 రాశులు ఇవే.. ఇందులో మీది ఉందా?

Today Horoscope in Telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు ఊహించిన దానికంటే డబ్బు వసూలు అవుతుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు అనవసరపు ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. […]

Today Horoscope in Telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు ఊహించిన దానికంటే డబ్బు వసూలు అవుతుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు అనవసరపు ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు కొత్త వస్తువులకు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు పాత బకాయిలను తీరుస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అదనపు ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. స్నేహితుల సహాయంతో అప్పులను తీరుస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈరోజు ఉద్యోగులు ఈరోజు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈరోజు వారు ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు వారు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొంటారు. ఇలాంటి సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. జాతులకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలో పాల్గొంటే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక విశేషాలు జరగనున్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చేందుకు మార్గం ఏర్పడుతుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. ఇష్టమైన పనులకు మాత్రమే సమయానికి కేటాయించండి. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు చేపట్టిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలతో వ్యాపారులకు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓపికతో వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్యంతో ఉన్నవారు తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తను వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారి ఆలోచనలతో ఈరోజు మానసికంగా ఇబ్బంది పడతారు. అయితే ఇలాంటి సమయంలోనే ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యక్తుల పరిచయంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని ధన లాభం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper