Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాసులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకుంటారు. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. పెద్దల అండదండలతో వ్యాపారులు కొత్తపెట్టబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు గణనీయంగా లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే తోటి బాగా స్వాములతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పెద్దల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలో తోటి వారి సహాయం తీసుకోవాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. స్నేహితులతో కలిసి సరదాగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు లక్ష్యాలను పూర్తి చేయడానికి సిద్ధమవుతారు. బడ్జెట్ ప్రకారమే ఖర్చులు చేయాలి. దుబార ఖర్చులను నివారించాలి. విద్యార్థులు పోటీపరచగా పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో వ్యాపారం అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తులో వచ్చే లాభాల కోసం ఇప్పుడే పెట్టుబడులు పెడతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. పాత రుణాల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కొత్త పెట్టుబడులను పెడతారు. దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబా అండదండలతో వ్యాపారులు లాభాలు పొందుతారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కోపాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాటులను పాటించాలి. వ్యాపారులు కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరించనుంది. గతంలో మొదలు పెట్టిన పనులను ఇప్పుడు చేరువేగంగా పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా పురోగతి లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. కుటుంబంలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తాయి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. అలసట ఉన్నవారు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరించింది. ఉద్యోగులు నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది.