Homeఆధ్యాత్మికం'Today horoscope in Telugu 19.8.2026 : ఈ ఐదు రాశుల వారు ఈరోజు నక్క...

‘Today horoscope in Telugu 19.8.2026 : ఈ ఐదు రాశుల వారు ఈరోజు నక్క తోకను తొక్కినట్లే..

Today horoscope in Telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు […]

Today horoscope in Telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు ఊహించిన దానిపంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. వీరితో సంబంధాలు మెరుగుపడతాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు అనుకున్న ఆర్థిక ఫలాలు పొందడంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తాను. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్తగా ఏదైనా ప్రాజెక్టును ప్రారంభించాలని అనుకుంటే ఇదే మంచి సమయం.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు తమ మాట తీరదు ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఓపికతో వ్యవహరించాలి. అనవసరపు రాద్ధాంతాలు చేయకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్త వాహనాల కొనుగోలుకు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీ మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉన్నపలంగా వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. కొత్త పనులను ప్రారంభించడానికి కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన సమయం ఉంటుంది. తోటి వారి సహాయంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇష్టమైన ఆహారాన్ని తీసుకోవాలి. కానీ ఇదే సమయంలో నాణ్యమైన దాన్ని ఎంచుకోవాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టు చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు మొత్తం పనులన్నీ ఒకే కాలంలో పూర్తి చేస్తారు.. దీంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ప్రియమైన వారితో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల కంటే ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగులకు తోటి వారి సహాయం అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఊరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే ఇదే సమయంలో పెద్దలను సంప్రదించడం మంచిది. కుటుంబ సభ్యుల అండదండలతో ఉద్యోగులకు కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇంట్లోనే రహస్యాలు ఇతరులకు చెప్పకుండా ఉండాలి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. దీంతో పూర్వీకుల హాస్టల్కి సంబంధించిన వార్తలు వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అనేక ప్రయోజనాలను పొందుతారు. అయిపోయిన పనులను పూర్తి చేస్తారు. పెండింగు బకాయిలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కొత్త వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించి వస్తువులు కొనుగోలు చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper